సెక్స్ పట్ల చాలా మందికి అవగాహన లోపం, పలు అపోహలు.. లైంగిక ఆరోగ్యానికి అవరోధాలుగా నిలుస్తున్నాయని వైద్యులు అంటున్నారు. సెక్స్‌కు సంబంధించి ఎటువంటి సందేహాన్నైనా వెంటనే నిపుణులను సంప్రదించి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం గడపడం వల్ల వాళ్ల ఆరోగ్యమే కాక వారి ఉత్పాదకత కూడా పెరుగుతుంది. సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
శృంగారంతో ఇద్దరిలోనూ ఆయుఃప్రమాణం మెరుగవుతుంది. చక్కని వ్యాయామం చేకూరి అధిక బరువు, గుండెపోటు, పక్షవాతం మొదలైన ముప్పుల నుండి దూరంగా ఉండవచ్చు. ఎలాంటి డిప్రెషన్ కి లోనవ్వకుండా చక్కటి నిద్ర సొంతమవుతుంది. ధృడమైన శరీరసౌష్టవం, నిగారించే చర్మం.. లైంగిక ఆరోగ్యం తో చేకూరుతాయని గమనించాలి.
ఇక ప్రతీ యేటా సెప్టెంబరు 4వ తేదిన, ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం గా 2010 నుండి World Association for Sexual Health (WAS) నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో అపోహలు తొలగించి, అవగాహన కలిగించడం ముఖ్యోద్దేశంగా అనేక కార్యక్రమాలు తలపెట్టింది.

No comments:
Post a Comment