అందం - ఆరోగ్యం : ఆలీవ్ ఆయిల్ | Olive Oil Health Benefits | Vantinti Chitkalu

ఆలీవ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ నివారింపబడుతుంది. తద్వారా గుండెకు రక్షణగా పని చేస్తుంది. ఈ మోనోశాచురేటెడ్‌ ఆయిల్ క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. అలాగే సౌందర్యపోషణలోనూ ఆలీవ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా నిగనిగలాడడానికి, చర్మకాంతికి, పెదవులు తాజాగా ఉండడానికి .. మరి ఆలీవ్ నూనెను ఎలా ప్రయోగించాలో చూద్దామా..!
- ఒక్కో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం, కోడిగుడ్డు సొన తీసుకుని అన్నిటిని బాగా కలియపెట్టాలి. దీనిని కాస్త ఆలీవ్ ఆయిల్ తో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి పూర్తి జుట్టుకు పట్టించాలి. అరగంట ఆగాక తలస్నానం చేస్తే జట్టు పట్టుకుచ్చులా మారిపోతుంది.
 
- తేనె, శనగ పిండి, పాలు సరిపడా తీసుకుని చక్కగా కలిపిపెట్టుకోవాలి. దీనికి కాస్త ఆలీవ్‌ ఆయిల్‌ చేర్చుకుని మిక్స్‌ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల కాంతిహీనంగా మారిన చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది.  

- పెదవులు సహజ సిద్ధంగా మెరుస్తూ ఉండాలంటే కాస్త ఆలీవ్ ఆయిల్ తీసుకుని ఇందులో కొంచం తేనె, పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదాలు బాగా శుభ్రంగా కడుక్కున్న తరువాత రబ్ చేసిచూడండి.
visit & subscribe
https://www.youtube.com/c/vantintichitkalu

No comments: