సాధారణమైన ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోవాలంటే ఎదైనా షాకింగ్ న్యూస్ చెప్పడమో, భయపెట్టడమో చేస్తారు. ఒక్కోసారి వెక్కిళ్ళు తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. మరి అలాంటప్పుడు ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
- మంచి నీళ్లు తాగుతే వెక్కిళ్లు తగ్గుతాయి. లేదా గట్టిగా గాలి పీల్చి మెల్లగా వదుల్తుంటే తగ్గుముఖం పడ్తాయి.
- అల్లం శుభ్రపరచి తొక్కతీసి చిన్నముక్కలుగా తరిగి అరచెంచా తీసుకుంటే చిటికిలో వెక్కిళ్లు మాయమవుతాయి. కావాలనుకుంటే కాస్త తేనె చేర్చుకోవచ్చు.
- అల్లం, బెల్లం రెండుకలిపి పేస్టు చేసుకుని రుమాలులో చుట్టి వాసన చూడాలి. శొంఠి అయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
- చిటికెడు యిలాయిచీల పొడిని అర కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించి చల్లార్చినాక సేవించాలి.
- కప్పు పెరుగులో కాసింత రుచికి ఉప్పు కలుపుకుని కొద్దికొద్దిగా తినాలి.
- సమపాళ్ళలో జీలకర్ర, బెల్లం తీసుకుని ముద్దలాగ నూరుకుని నోట్లో వేసుకుని కాసేపు చప్పరించాలి.
- చిన్న పిల్లలకు వచ్చే ఎక్కిళ్ళకు పంచదార నీళ్ళు పట్టిస్తే సరిపోతుంది.

No comments:
Post a Comment