రోజూ ప్రతి పనిలో 'జాగ్రత్త..!' అని శ్రేయోభిలాషులు చెప్పడమో, ఇతరులకు మనం చెప్పడమో చూస్తుంటాం. కారణం ఒక చిన్న అజాగ్రత్త ఎంతో కష్టం, నష్టం తెచ్చిపెట్టవచ్చు. అందుకని అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంటింటి నుంచి బయటి ప్రయాణాల వరకు తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగు మూల్యం చెల్లించుకోక తప్పదేమో..
- పిల్లల గదిలో గోడలు, ఫర్నీచర్ వగైరా షార్ప్ ఎడ్జెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రికల్ పాయింట్స్ వాళ్లకి అందనంత ఎత్తులో ఉండాలి. డమ్మీలతో ప్లగ్ పాయింట్స్ ని కచ్చితంగా మూసివేయాలి.
- గృహావసరాలకు వాడే కత్తి, కత్తిపీట, చాకు, బ్లేడు వంటి పదునైనా వస్తువులు పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాలి.
- చిన్నపిల్లలకు అందకుండా వేడి కుక్కర్, ఇతర పాత్రలను పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద వేసిన క్లాత్ కిందకు వేలాడుతూ ఉండకూడదు.
- పిల్లలకు స్నానానికి నీళ్ళు తోడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు అవసరం. పారాడే పాపాయిలు ఉన్న ఇంట్లో అయితే మూతలు లేని పాత్రల్లో నీటి నిల్వ అత్యంత ప్రమాదకరం.
- చిల్లర డబ్బులు, మందులు, యూసిడ్ బాటిళ్లను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
- ముఖ్యంగా ఎలక్ట్రికల్ గ్రైండర్, ఐరన్ బాక్స్, ఇమ్మర్షన్ రాడ్, ఇతర హీటర్లను పిల్లలు నిద్రిస్తున్న సమయంలోనే వాడడం ఉత్తమం.
- చేతితో మిక్సీ బ్లేడ్స్ ని మార్చడం అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. విధిగా స్పానర్ ని వాడాలి.
- వంట పూర్తయిన వెంటనే ఇండక్షన్ స్టవ్ స్విచ్ఛాప్ చేసి, ప్లగ్‌ను తొలగించడం తప్పనిసరి. అలాగే ఎలాంటి ఎలక్ట్రికల్ లేదా ఎలాక్ట్రానిక్ పరికరమైనా పనిపూర్తైన వెంటనే పవర్ స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ ను విధిగా తొలగించడం మరవద్దు.
- ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పడు జనించే హైఓల్టేజీతో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదముంది. అలాగే టెలీఫోన్ వినియోగం కూడా అత్యంత ప్రమాదకరం అని గుర్తించండి.
- వంట పూర్తవగానే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవడం మంచిది. ఎల్లప్పుడు గ్యాస్ స్టవ్ పరిసరాల్లో గాలి ప్రసరణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇన్సెక్ట్ కిల్లర్స్, దీపాలు దాని దగ్గరలో వినియోగించకూడదు. గ్యాస్ లీకేజి ఉందనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ స్విచెస్ ఆన్ / ఆఫ్ చేయకూడదు. దగ్గరలో మొబైల్ ఫోన్ వినియోగించకూడదు.
- కారులో ప్రయాణం చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.
- టూ వీలర్ రైడింగ్ లో విధిగా నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. అంతేకాకుండా హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోవటం తప్పనిసరి.

No comments:
Post a Comment