ప్రస్తుత డిజిటల్ యుగంలో ముఖ్యంగా సోషల్ మీడియా అనేది నేటి యువత చేతిలో ఉన్న పెద్ద ఆయుధం అనే చెప్పాలి. అరచేతిలో విశ్వవ్యాప్తంగా ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుకోవడమే కాక తమ ఆలోచనలను వ్యక్తం చేయడానికి, సృజనాత్మకతను ప్రదర్శించేందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారాయి. సోషల్ మీడియాను యువతరం వినూత్నంగా ఉపయోగిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఆడియో రిలీజ్ అయిన వెంటనే సినిమా పాటలకు సొంతంగా కొరియోగ్రాఫ్ చేసుకుని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న వీడియోలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాను ప్రజాహిత కార్యక్రమాలకు వేదికగా చేసి నూతన ఒరవడికి నేటి యువత శ్రీకారం చుట్టింది. పండగలకు పబ్బాలకు వాటి ప్రాశస్త్యం తెలియచేస్తూ ఎంతో చక్కగా యూట్యూబ్ లో సాంగ్స్ తీర్చిదిద్ది మన సంస్కృతీసంప్రదాయాలను భవిష్యత్ తరాల కంటికికడుతున్నారు. ఇక ప్రజల్లో దేశభక్తిని పెంపొందిచేందుకు సోషల్ మీడియా వేదికగా లఘు చిత్రాలు, పాటలు, కవితలు, రచనలు.. ఇలా ఎన్నో మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో జాతీయ గీతాలు ఎంతగా దోహదం చేస్తాయో మనకు తెలియంది కాదు. ప్రధానంగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భాల్లో సినిమాల లేదా ప్రయివేట్ దేశభక్తి గీతాలు యూట్యూబ్ లో ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. భారతావని 72వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న ఈ యేడాది విడుదలైన బాలీవుడ్ హిట్ చిత్రం రాజి లోని ' ఏ వతన్.. ' పాట అందరినోటా వినిపిస్తోంది.
https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment