ప‌టిక‌బెల్లం.. | Health Benefits of Sugar Candy


ప‌టిక‌బెల్లం.. కండ చ‌క్కెర.. మిశ్రి..  ఇలాగ అనేక పేర్లతో పెద్ద పెద్ద స్ఫ‌టికాలుగా ఉండే ఒక రకమైన పంచదార వాత, పిత్త, కఫ దోషాల నివారణలో ఔషధంగా పనిచేస్తుంది.

- చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి మెల్లగా  తగ్గుతాయి.
- గ్లాసు గోరువెచ్చని పాలల్లో అరచెంచా మిరియాల పొడీ, కొద్దిగా పటికబెల్లం బాగీ కరిగించి తీసుకుంటే వెంటనే గొంతులో కిచ..కిచ.. మాయమవుతుంది.
- రోజూ పడుకునే ముందు గ్లాసుపాలల్లో చెంచా పటికబెల్లం పొడి కలిపి తాగితే ఎలాంటి బలహీనత‌ దరిచేరదు.
- పిల్లలు, గర్భిణీ స్త్రీలు పంచదారకు బదులుగా ప‌టిక‌బెల్లం వాడడం శ్రేయష్కరమని మన పెద్దలు సూచిస్తుంటారు.
- గొంతుపట్టింది.. అంటూ అసలు మాట్లాడడానికే ఇబ్బందిపడేవారు వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి తీసుకుంటే సరిపోతుంది. గొంతు బొంగురు ఇట్టే నయమవుతుంది కూడా.
- నీళ్ల విరేచనాలు అరికట్టడానికి అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తినాలి.
- చిన్నగా కోసిన నిమ్మకాయ ముక్క పై పటికబెల్లం పొడి చల్లి బుగ్గన పెట్టుకుంటే వికారం, వాంతులు ఇట్టే తగ్గిపోతాయి.
- పిల్లలు వేడిచేసి ఏడుస్తూంటే మంచినీళ్ళలో చిన్న పటికబెల్లం ముక్క వేసి కరిగించిన నీటిని పట్టించాలి. వీటితో దాహం కూడా తీరుతుంది.


No comments: