తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి పూత నుంచి ఉపశమనం పొందడానికి..
- గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని రోజూ పుక్కిలించాలి.
- నిమ్మ, ఆరెంజ్.. వగైరా సిట్రస్ ఫ్రూట్స్ లో పుష్కలంగా లభించే విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి నోటి పూతను నివారిస్తుంది.
- కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. కొబ్బరినూనెను పుండ్లపై అప్లై చేయడం ద్వారా వెంటనే నోటి పూత నుంచి విముక్తి కలుగుతుంది.
No comments:
Post a Comment