పళ్ళు ఆరోగ్యంగా తెల్లగా మెరవాలంటే..
ఉదయం వేళ టూత్ బ్రష్ చేసుకోవడంతో పాటు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కచ్చితంగా తిరిగి చెయ్యాల్సిందేనని వైద్య నిపుణులు అంటున్నారు. లేదంటే అనేక రోగాలపాలు కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. అనేక రకాల బాక్టీరియాల నుంచి దంతాలను కాపాడుకోవాలంటే పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం ఉత్తమం. కుదరక పోతే నీళ్లతో నోటిని బాగా పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన పాచితో పాటు పళ్ల అంచుల చుట్టూ అతుక్కున్న ఆహార పదార్థాలను ఇది తొలగిస్తుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను కాపాడుకున్నవాళ్ళం అవుతాం .
పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది. నిద్రలో ఎలాంటి లాలాజలం ఉత్పత్తికాదు. కారణంగా బాక్టీరియా నోట్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలపై దాడి చేస్తుంది. అంతేకాదు పంటి ఎనామిల్‌ను దెబ్బతీసే ఆమ్లాలను సైతం ఈ బాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా పళ్లపై గార, పుప్పి పళ్ళు, చిగుళ్ళవాపు తదితర దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనితో పూర్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

No comments:
Post a Comment