బొప్పాయి పండులో విటమిన్ - ఎ పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ - బి1, విటమిన్ - బి2, విటమిన్ - బి3, విటమిన్ - సి, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.
బొప్పాయి - ఆరోగ్యం
- బాలింతలు బొప్పాయి పచ్చికాయను వండుకుని తినడం వల్ల వారిలో స్తన్యం ఎక్కువగా వస్తుంది.
- డెంగీ జ్వరం తో బాధ పడుతున్నప్పుడు ప్లేట్ లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు ఎంతో సహాయ పడుతుంది.
- నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు తలెత్తకుండా కాపాడుతుంది.
- బొప్పాయి పండు తీసుకోవడంతో హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు.
ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తుంది.
ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తుంది.
- అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలకు బొప్పాయి చక్కని ఔషధం.
- జీర్ణకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నప్పుడు బొప్పాయి కాయలను కూరగా వండుకుని
క్రమంతప్పకుండా తింటూండవల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
- బొప్పాయి ఆహారాన్ని వెంటనే అరిగేలా చేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- రక్త ప్రసరణ పెరగడానికి, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.
బొప్పాయి - సౌందర్యం
- బొప్పాయి మన చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది. దీని కారణంగా బ్యూటీక్రీమ్‌లు,
బ్యూటీ లోషన్లలో ఈ పండును విరివిగా వాడతారు.
బ్యూటీ లోషన్లలో ఈ పండును విరివిగా వాడతారు.
- బొప్పాయి గుజ్జును మొహానికి పట్టించి కాసేపయ్యాక శుభ్రపరచడం వల్ల చర్మం కాంతులీనుతుంది.
- బొప్పాయి వృద్ధాప్య లక్షణాలను దరిచేరకుండా చూస్తుంది.
బొప్పాయి - చిట్కాలు
- బొప్పాయి ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.
- మాంసం త్వరగా ఉడకడానికి కొన్నిబొప్పాయి కాయ ముక్కలను కలిపితే సరి.
- ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకపోవడం, అతిగా భుజించడం, మానసిక ఒత్తిడి ..
వగైరా కారణాలు జీర్ణకోశాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు ఒక్కటే మార్గం.
- ఆకలి లేకపోవటం, నీరసంగా ఉండడం లక్షణాలకు బొప్పాయి పండు చక్కగా పనిచేస్తుంది.
No comments:
Post a Comment