అమ్మాయిలూ జర జాగ్రత్త.. | Beware of False Love | Love & Relationships | VantintiChitkalu | వంటింటి చిట్కాలు

అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమపేరుతో మోసపోకుండా స్పృహాలో ఉండడం చాలా అవసరం.
- అందచందాలను వర్ణిస్తుంటే ఏ అమ్మాయైనా ఇట్టే బుట్టలో పడాల్సిందేనని కొందరి నమ్మకమైతే ఇంకాస్త తెలివైనవాళ్లు(దుర్మార్గపు) కళ్లు, ముక్కు, కంఠస్వరం ఇలా అదిరిపోయాయంటూ పొగడ్తలకు దిగుతారు. వాస్తవాలను గ్రహించి అమ్మాయిలే అప్రమత్తంగా ఉండాలి.
- అమ్మాయిల హృదయాలను దోచుకోవడానికి చిన్నచిన్న బహుమతులను (తక్కువ ఖర్చులో)  ఎరగా వేస్తుంటారు. పాపం డబ్బుతో ఏముందిలే మనసుకదా ప్రధానం అనుకుని ఖరీదైన బహుమతులను అందచేస్తూ బోల్తాపడతారు కొందరు అమ్మాయిలు.
- ప్రేమంటూ దరిచేరేవారి ప్రవర్తనపై ఆరాతీయాలి. మీతో వ్యవహరిస్తున్న తీరులో మరియేతరులతోనైనా ఉన్నారేమో గమనించాలి. మిగతా అందరితో సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడా తెలసుకోవాలి. వారి ప్రేమలో నిజాయితీ పాలు ఎంతో లెక్కకట్టిఅడుగేయ్యాలి.
- చదువు, చిరునామా, ఉద్యోగం, కుటుంబనేపథ్యం ఇలా పూర్తి వివరాలు రాబట్టగలగాలి. కార్లు, బంగ్లాలు బంధువులు, స్నేహితులవైనా తనవేనని బురిడీకొట్టిచ్చే ప్రమాదముంది. ధనికులమని నమ్మించడానికి వేసే పైపై మెరుగులను గుర్తించాలి.
- గర్ల్ ఫ్రెండ్ ఒక సరదాకోసమో, కాలక్షేపానికో అనుకునేవారున్నారు. గర్ల్ ఫ్రెండ్ వేటలో ఇదివరలోనే పెళ్లి అయిన వాళ్లు, పిల్లలున్నకల వాళ్లు కూడా పడ్తారు. వారి ప్రేమలో పడే అమ్మాయిలే జాగ్రత్తపడాలి మరి.
- పబ్బులు, పార్టీలు ఇలా వేటికైనా ఒంటరి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఒకే అమ్మాయిని ఆహ్వానించడంలో దుర్బుద్ధిదాగుందని పసిగట్టాలి. ఒంటరి అమ్మాయిని చేసి వారి స్నేహితులంతా కలసి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంది.
- కారణమేదైనా బాయ్ ఫ్రెండంటూ ఒకే హొటల్ గదిలో ఉండడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం, రాత్రివేళల్లో కలవడం అన్నీ అత్యంత ప్రమాదకరమే.
- డ్రింకులు, ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. మత్తుపనీయాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం. ఇరువురు సేవించినా, బాయ్ ఫ్రెండ్ సేవించినా గ'మ్మత్తు'లో చిత్తయ్యేది అమ్మాయే.
- అన్నీ వేళలా వారితో కలిసే ప్రదేశం నలుగురు అందుబాట్లో ఉండేదై ఉండాలి. నిర్జన ప్రదేశం, ఎత్తైన కొండలు, సెలయేరులంటూ ఎకాంతం మంచిదికాదు.
-  బాయ్ ఫ్రెండ్ వెకిలిచేష్టలను ఎప్పటికప్పుడు నిరోదించగలగాలి. కోరికలు తీర్చుకోవడానికి తహతహలాడే వాడిని మనసు గాయపడకుండా తెలివిగా తిప్పికొట్టాలి.
- అవకాశం చిక్కినప్పుడల్లా తనొక్కతే గర్ల్ ఫ్రెండా ఇంకేవరైనా ఉన్నారాని మోబైల్ ఫోను, మేయిల్ బాక్స్ పై కన్నేసి ఉంచాలి.
- ఒకరికై ఒకరు వెచ్చిస్తున్న డబ్బు ఎంతో కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా డబ్బు నీకై ఖర్చుచేసానని  బాయ్ ఫ్రెండ్ కి సాకు దొరకనీయకూడదు. మీరే ఎక్కువ మొత్తంలో డబ్బు అతని కోసమై ఖర్చుచేస్తూంటే ఆర్ధిక అవసరాలకై మిమ్మల్ని వాడుకుంటున్నాడని అనుమానించాలి.

ఈ విషయాలే కాకుండా యువత భారతదేశంలో పెళ్ళి, కుటుంబ వ్యవస్థలు బలీయమైనవని, ఆదర్శప్రయమైనవని ఎల్లప్పుడూ గుర్తెరగాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందగాడా, ధనవంతుడా అని చూసుకోవడం కంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది. శాశ్వతంకాని అందం, ధనం భ్రమలో పడి గుణం లేనివాడితో ఏడడుగులేస్తే  జీవితమంతా చీకటిమయమే.

No comments: