ఆకుకూరలు : ఆరోగ్యం - సౌందర్యం | Leaf vegetables are great for your Health | VantintiChitkalu | వంటింటి చిట్కాలు

పోషకాల గనులు
ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శరీరానికి కావల్సిన అనేక ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. తోటకూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలి, మునగ, అవిశె.. వగైరా ఆకుకూరలతో అత్యధిక కేలరీల శక్తి ఇట్టే లభిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకు వగైరా వంటలకు ఘుమఘుమలు అందించడంతో పాటు రక్తవృద్ధిని, జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. పలు రోగాలు నయం చేయడంలోనూ, అవి దరిచేరకుండానూ ఇవి కాపాడుతాయి. అందుకే మన రోజూ ఆహారంలో పచ్చని ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇవి శుభ్రపరచుకోవడం, వలుచుకోవడం, తరగడం కష్టమని వీటికి దూరం కావద్దు. అలాగే వాటి నిల్వలో, వంటలో పోషకాలు నశించకుండా మరెన్నో జాగ్రత్తలు అవసరం.
- వండటానికి ముందు శుభ్రంగా రన్నింగ్ వాటర్ లో కడగాలి. వీలైతే కాసేపు కాస్త ఉప్పు చేర్చిన నీటిలో నాననివ్వాలి.
- తాజా ఆకుకూరలు వాడుకోవడమే ఉత్తమం. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకూడదు.
- ఆకుకూరలపై సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. లేదంటే వాటిల్లోని కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి.
- ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి లేదా అసలు తరగకుండా వండుకోవడం చాలా మంచిది.
- ఆకుకూరలు వండేటప్పులు వంట పాత్రలపై మూతలు పెట్టుకోవాలి. వీటిని వేయించడం తగదు.
www.youtube.com/c/vantintichitkalu

No comments: