మీకు రచనాసక్తి ఉంటే బుక్కు, పెన్నుతో పనే లేదు | The Art of Texting | Amazing Benefits of Having a Smartphone | First Leaf - muso / నాలో నేను - ముసో | vantintichitkalu | వంటింటి చిట్కాలు

మీకు మొబైల్ ఫోన్ కవి కానీ, రచయిత కానీ కావాలని ఉందా..
స్మార్ట్ ఫోన్ అంటే సమయాన్ని వేస్ట్ చేసే గాడ్జెట్ అనుకుంటున్నారా.. అయితే మీ ఆలోచన మార్చుకోండి. స్మార్ట్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనమే కాదు. ప్రపంచమంతా మీ గుప్పిట్లో ఉన్నట్లే. ఇంతేకాదండోయ్.. మీకు రచనాసక్తి ఉంటే బుక్కు, పెన్నుతో పనే లేదు. చక్కగా చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లోనే రాసేస్తూ మీరు కవో రచయితో అయిపోవచ్చు.ఇలా ఈమధ్య ముసో అనే ఓ తెలుగు కవి, రచయిత మొబైల్ ఫోన్ తో వినూత్న ప్రయోగం చేశారు. స్మార్ట్ ఫోన్ తో హైకూలనే మైక్రో పోయెట్రీ రాసేసి ఆ తర్వాత ఓ పుస్తకంగా ప్రింట్ వేయించారు. అదే మై ఫస్ట్ లీఫ్- ఇంగ్లిష్ మోడ్రన్ పోయెట్రీ, నాలో నేను అనే తెలుగు హైకూల కాంబో ఎడిషన్.

మీరు కూడా మొబైల్ ఫోన్ కవో, రచయితో అయిపోచ్చు. అదెలాగంటారా.. బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడో,  ఆఫీసులో కాస్త టైమ్ దొరికినప్పుడో, ఇంట్లో బోర్ కొట్టినప్పుడో మొబైల్ చేతబట్టుకుని రాయదలుచుకున్నది రాసేయండి. అలా అలా కొంత మెటీరియల్ పోగయ్యాక ఓ బుక్కులా అచ్చేసుకోవచ్చు. లేదంటే మీకంటూ ఓ ఫేస్ బుక్ పేజో మెయింటెయిన్ చేసేయ్యొచ్చు. ఈ ఐడియా ఇప్పటిది కాదండోయ్. జపాన్ లో ఏకంగా మొబైల్ నవలలే పాపులర్ అయిపోతున్నాయి. 2002 లో ఓ జపనీ కుర్రది మొబైల్ ఫోన్ పట్టుకుని నవలకు శ్రీకారం చుట్టింది. అది అలా అలా సాహిత్య ప్రక్రియలా ప్రాచూర్యంలోకి వచ్చింది. బోలెడు మంది మొబైల్ నావెలిస్టుల్నీ తయారుచేసింది. జపాన్ నుంచి అమెరికా, బ్రిటన్ మీదుగా యూరప్ దేశాలకూ ఈ సరికొత్త సాహిత్య ప్రక్రియ పాకుతూ పోతోంది. ఇంకెందుకాలస్యం.. మీరూ ట్రై చేయండి. ఈలోగా ముందు చెప్పిన హైకూ పుస్తకం విశేషాలేమిటో చూడండి.
 

My First Leaf - Modern Haiku
నాలో నేను - తెలుగు హైకూలు
 

రచయిత - ముసో
వెల - రూ. 80
ఆన్ లైన్ స్పెషల్ ఎడిషన్ - రూ. 100

http://vmrgbooks.com/index.php?route=product/product&product_id=296
పబ్లిషర్స్ - Swings Media

26 November: National Milk Day | జాతీయ పాల దినోత్సవం | vantinti chitkalu | వంటింటి చిట్కాలు

పాల ప్రాశస్త్యత
పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాలలో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరువేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో - ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. ఆవు పాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృత్తులు 3.4 శాతం, పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 0.7 శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృత్తులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.
 

అమ్మాయిలూ జర జాగ్రత్త.. | Beware of False Love | Love & Relationships | VantintiChitkalu | వంటింటి చిట్కాలు

అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమపేరుతో మోసపోకుండా స్పృహాలో ఉండడం చాలా అవసరం.
- అందచందాలను వర్ణిస్తుంటే ఏ అమ్మాయైనా ఇట్టే బుట్టలో పడాల్సిందేనని కొందరి నమ్మకమైతే ఇంకాస్త తెలివైనవాళ్లు(దుర్మార్గపు) కళ్లు, ముక్కు, కంఠస్వరం ఇలా అదిరిపోయాయంటూ పొగడ్తలకు దిగుతారు. వాస్తవాలను గ్రహించి అమ్మాయిలే అప్రమత్తంగా ఉండాలి.
- అమ్మాయిల హృదయాలను దోచుకోవడానికి చిన్నచిన్న బహుమతులను (తక్కువ ఖర్చులో)  ఎరగా వేస్తుంటారు. పాపం డబ్బుతో ఏముందిలే మనసుకదా ప్రధానం అనుకుని ఖరీదైన బహుమతులను అందచేస్తూ బోల్తాపడతారు కొందరు అమ్మాయిలు.
- ప్రేమంటూ దరిచేరేవారి ప్రవర్తనపై ఆరాతీయాలి. మీతో వ్యవహరిస్తున్న తీరులో మరియేతరులతోనైనా ఉన్నారేమో గమనించాలి. మిగతా అందరితో సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడా తెలసుకోవాలి. వారి ప్రేమలో నిజాయితీ పాలు ఎంతో లెక్కకట్టిఅడుగేయ్యాలి.
- చదువు, చిరునామా, ఉద్యోగం, కుటుంబనేపథ్యం ఇలా పూర్తి వివరాలు రాబట్టగలగాలి. కార్లు, బంగ్లాలు బంధువులు, స్నేహితులవైనా తనవేనని బురిడీకొట్టిచ్చే ప్రమాదముంది. ధనికులమని నమ్మించడానికి వేసే పైపై మెరుగులను గుర్తించాలి.
- గర్ల్ ఫ్రెండ్ ఒక సరదాకోసమో, కాలక్షేపానికో అనుకునేవారున్నారు. గర్ల్ ఫ్రెండ్ వేటలో ఇదివరలోనే పెళ్లి అయిన వాళ్లు, పిల్లలున్నకల వాళ్లు కూడా పడ్తారు. వారి ప్రేమలో పడే అమ్మాయిలే జాగ్రత్తపడాలి మరి.
- పబ్బులు, పార్టీలు ఇలా వేటికైనా ఒంటరి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఒకే అమ్మాయిని ఆహ్వానించడంలో దుర్బుద్ధిదాగుందని పసిగట్టాలి. ఒంటరి అమ్మాయిని చేసి వారి స్నేహితులంతా కలసి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంది.
- కారణమేదైనా బాయ్ ఫ్రెండంటూ ఒకే హొటల్ గదిలో ఉండడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం, రాత్రివేళల్లో కలవడం అన్నీ అత్యంత ప్రమాదకరమే.
- డ్రింకులు, ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. మత్తుపనీయాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం. ఇరువురు సేవించినా, బాయ్ ఫ్రెండ్ సేవించినా గ'మ్మత్తు'లో చిత్తయ్యేది అమ్మాయే.
- అన్నీ వేళలా వారితో కలిసే ప్రదేశం నలుగురు అందుబాట్లో ఉండేదై ఉండాలి. నిర్జన ప్రదేశం, ఎత్తైన కొండలు, సెలయేరులంటూ ఎకాంతం మంచిదికాదు.
-  బాయ్ ఫ్రెండ్ వెకిలిచేష్టలను ఎప్పటికప్పుడు నిరోదించగలగాలి. కోరికలు తీర్చుకోవడానికి తహతహలాడే వాడిని మనసు గాయపడకుండా తెలివిగా తిప్పికొట్టాలి.
- అవకాశం చిక్కినప్పుడల్లా తనొక్కతే గర్ల్ ఫ్రెండా ఇంకేవరైనా ఉన్నారాని మోబైల్ ఫోను, మేయిల్ బాక్స్ పై కన్నేసి ఉంచాలి.
- ఒకరికై ఒకరు వెచ్చిస్తున్న డబ్బు ఎంతో కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా డబ్బు నీకై ఖర్చుచేసానని  బాయ్ ఫ్రెండ్ కి సాకు దొరకనీయకూడదు. మీరే ఎక్కువ మొత్తంలో డబ్బు అతని కోసమై ఖర్చుచేస్తూంటే ఆర్ధిక అవసరాలకై మిమ్మల్ని వాడుకుంటున్నాడని అనుమానించాలి.

ఈ విషయాలే కాకుండా యువత భారతదేశంలో పెళ్ళి, కుటుంబ వ్యవస్థలు బలీయమైనవని, ఆదర్శప్రయమైనవని ఎల్లప్పుడూ గుర్తెరగాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందగాడా, ధనవంతుడా అని చూసుకోవడం కంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది. శాశ్వతంకాని అందం, ధనం భ్రమలో పడి గుణం లేనివాడితో ఏడడుగులేస్తే  జీవితమంతా చీకటిమయమే.

పండ్లు శుభ్రంగా కడగాలి | Simple tricks to remove Pesticides from Fruits | VantintiChitkalu

తొక్క ఉన్న పండ్ల విషయంలో కూడా జాగ్రత్త..!
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని ఆరగించాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం..- ధారగా వస్తున్న నీటిలో పండ్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల విషరసాయనాలతో పాటు నిగనిగలాడడానికి పూసిన రంగులు, నూనెలు వగైరా దూరమవుతాయి.
- గోరువెచ్చటి నీళ్లలో పూర్తిగా పండ్లు కాసేపు ఉంచి కడగడంతో తొందరగా మళినాలు వదిలే అవకాశముంది.
- కాస్త ఉప్ఫు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచి నీళ్లలో మునిగేలా ఉంచి చక్కగా రుద్ది కడిగి పొడిగా తుడిచాకే  పండ్లని తినాలి.
- పండ్లు పగుళ్లున్నా, దెబ్బతగిలినా తినకూడదు. పగుళ్లతో పండ్ల లోపలికి వెళ్లిన రసాయనాలు మన ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు తెస్తాయి.
- కుళ్లిపోయిన పండ్లు, రసాయనాలు పొడిరూపంలో పైన కనిపించిన పండ్ల జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి.
- గది ఉష్ణోగ్రతలకు మించి లేదా రిఫ్రిజిరేటర్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లు విషతుల్యమే.
- అరటి, కమలా, బత్తాయి వంటి తొక్క ఉన్న పండ్ల విషయంలో కూడా జాగ్రత్తలవసరం.

గురక నివారణకు వంటింటి చిట్కాలు | Don't ignore the snore - Snoring may be early sign of future health risks | Tips to Help You and Your Partner Sleep Better | खर्राटे रोकने के उपाय | VantintiChitkalu

మన నిద్రకు అవరోధం, తోటివారికి అసౌకర్యం కలిగించేది గురక.
నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికితోడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం కూడా గురకకు కారణాలు కావచ్చు. ఈ వంటింటి చిట్కాలతో గురక సమస్యని శాశ్వతంగా తరమండి.

- తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనెతో కొన్నిరోజులపాటు మూడు పూటలా తీసుకోవాలి.
- రాత్రి పడుకునే ముందు యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపిన నీటితో ఆవిరి పట్టాలి.
- పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ కలిపిన గ్లాస్ నీటితో రోజూ రాత్రి బాగా పుక్కిలించాలి.
- ఆలివ్‌ ఆయిల్‌, తేనెల ఒక స్పూన్ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు తీపుకోవాలి.
- గోరువెచ్చటి నీటిలో కాస్త స్పూన్‌ ఇలాయిచీ పొడి చేర్చి తాగి పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- శొంఠి, పిప్పళ్లు, మిరియాలు.. వీటి పొడిని తేనెతో కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.

పాదాలు జాగ్రత్త సుమా .. | How to keep my legs warm in winter? | Diabetic Neuropathy Care | vantintichitkalu

పాదం పదిలం
చలికాలంలో పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కాలి మడమలపై పగుళ్ల సమస్య తలెత్తుతుంది. డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్యని అశ్రద్ద చేస్తే మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.

ప్రతిరోజూ పాదాలను గోరువెచ్చటి నీటితోనే కడగాలి. పాదాలను, కాళ్ళ వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. పగుళ్ళు ఇతర సమస్యలు బాధిస్తుంటే గోరువెచ్చని నీటిలో కాసేపు పాదాలను ఉంచి బ్రష్ తో శుభ్రపరచాలి. ఈ నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్‌ లేదా లావెండర్‌ ఆయిల్‌ ని కూడా వాడుకోవచ్చు. ఇవి మృతకణాలను తొలగించడం, చమట దుర్వాసనలను తరమడంతో పాటు యాంటి ఫంగల్‌గా పనిచేస్తాయి. మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేస్తుండాలి. ఫూట్ క్రీమ్ ను క్రమం తప్పకుండా రాస్తుండాలి. 

వంటింటి చిట్కాలు | Home Remedies for Health and Beauty | vantintichitkalu

వంటింటి చిట్కాలు
అందం, ఆరోగ్యం, అలంకరణ, టైం సేవింగ్.. దేనికైనా గృహచిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. పైగా పెద్ద సమస్యలకు సైతం ఉచితంగా, సునాయసంగా చిటికెలో సమాదానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మీ కోసం www.vantintichitkalu.com అందిస్తున్న ఎఫెక్టివ్ హోం రెమెడీస్.. వంటింటిచిట్కాలు యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.. 

ఆకుకూరలు : ఆరోగ్యం - సౌందర్యం | Leaf vegetables are great for your Health | VantintiChitkalu | వంటింటి చిట్కాలు

పోషకాల గనులు
ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శరీరానికి కావల్సిన అనేక ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. తోటకూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలి, మునగ, అవిశె.. వగైరా ఆకుకూరలతో అత్యధిక కేలరీల శక్తి ఇట్టే లభిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకు వగైరా వంటలకు ఘుమఘుమలు అందించడంతో పాటు రక్తవృద్ధిని, జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. పలు రోగాలు నయం చేయడంలోనూ, అవి దరిచేరకుండానూ ఇవి కాపాడుతాయి. అందుకే మన రోజూ ఆహారంలో పచ్చని ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇవి శుభ్రపరచుకోవడం, వలుచుకోవడం, తరగడం కష్టమని వీటికి దూరం కావద్దు. అలాగే వాటి నిల్వలో, వంటలో పోషకాలు నశించకుండా మరెన్నో జాగ్రత్తలు అవసరం.
- వండటానికి ముందు శుభ్రంగా రన్నింగ్ వాటర్ లో కడగాలి. వీలైతే కాసేపు కాస్త ఉప్పు చేర్చిన నీటిలో నాననివ్వాలి.
- తాజా ఆకుకూరలు వాడుకోవడమే ఉత్తమం. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకూడదు.
- ఆకుకూరలపై సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. లేదంటే వాటిల్లోని కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి.
- ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి లేదా అసలు తరగకుండా వండుకోవడం చాలా మంచిది.
- ఆకుకూరలు వండేటప్పులు వంట పాత్రలపై మూతలు పెట్టుకోవాలి. వీటిని వేయించడం తగదు.
www.youtube.com/c/vantintichitkalu

బియ్యం కడిగిన నీళ్ళు, గంజి అమృతమే..! | Health & Beauty Benefits of Rice Water | VantintiChitkalu

గంజి చేసే మేలు

గంజి నీళ్ళు.. మన ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. ఇది శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్యం ఈ గంజితో సాధ్యమవుతుంది. బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా బియ్యం ఉడుకుతున్నప్పుడే నీటిని వేరు చేయాలి. లేదా అన్నం ఉడకగానే మిగిలిన నీటిని పాత్రలోకి వార్చాలి. ఈ గంజిని వేడిగానైనా, చల్లారకనైనా తీసుకోవచ్చు. రుచికి ఉప్పు, పిప్పర్ పౌడర్ జోడించవచ్చు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణం శక్తిని చేకూరుస్తాయి. మనసు ప్రశాంతంగా మారి, ఏకాగ్రతను పెంచేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.

సౌందర్య పోషణలో..
- రైస్‌వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల, క్లెన్సింగ్‌ ఎఫెక్ట్‌ పొందవచ్చు.
  జిడ్డు, మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖ వర్చస్సు ఇనుమడింప చేస్తుంది.
- బియ్యం కడిగిన నీటిని జుట్టుకి బాగా పట్టించి కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే కురులు పట్టుకుచ్చులా మారతాయి.
- స్నానం చేసే నీటిలో బియ్యం కడిగిన నీటిని చేర్చడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. 

రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేస్తున్నారా? | Nighttime Tips for Improving Your Oral Health | VantintiChitkalu

పళ్ళు ఆరోగ్యంగా తెల్లగా మెరవాలంటే..
ఉదయం వేళ  టూత్  బ్రష్ చేసుకోవడంతో పాటు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కచ్చితంగా తిరిగి చెయ్యాల్సిందేనని వైద్య నిపుణులు అంటున్నారు. లేదంటే అనేక రోగాలపాలు కావాల్సిందే అని హెచ్చరిస్తున్నారు.  అనేక రకాల బాక్టీరియాల నుంచి దంతాలను కాపాడుకోవాలంటే పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం ఉత్తమం. కుదరక పోతే నీళ్లతో నోటిని బాగా పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన పాచితో పాటు పళ్ల అంచుల చుట్టూ అతుక్కున్న ఆహార పదార్థాలను ఇది తొలగిస్తుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను కాపాడుకున్నవాళ్ళం అవుతాం .

పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది. నిద్రలో ఎలాంటి లాలాజలం ఉత్పత్తికాదు. కారణంగా బాక్టీరియా నోట్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలపై దాడి చేస్తుంది. అంతేకాదు పంటి ఎనామిల్‌ను దెబ్బతీసే ఆమ్లాలను సైతం ఈ బాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా పళ్లపై గార, పుప్పి
పళ్ళు, చిగుళ్ళవాపు తదితర దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనితో పూర్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ముత్యమంత పసుపు.. | పసుపు - ఆరోగ్య ప్రయోజనాలు | Turmeric for Health! | हलदी के फायदे | VantintiChitkalu

పసుపు - దివ్య ఔషదం
పసుపు వాడకం మన భారతీయులకు అనాదిగా ప్రాచీన కాలం నుంచి వస్తోంది. శుభకార్యాల్లోనే కాకుండా ఆలయాలల్లో పూజలు కూడా పసుపుతోనే మొదలవుతాయి.  పసుపు యాంటీ సెప్టిక్‌ గుణాలతో పలు వ్యాధుల్ని ఇట్టే నయం చేస్తుంది. సౌందర్యపోషణలోనే మేటి.

- జలుబు, దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని 
   తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
- రాత్రిపూట ఒక పసుపు కొమ్మును గ్లాసు నీళ్ళలో వేసి ఉదయాన్నే ఆ నీటిని బాగా కలియబెట్టి 
   పరగడుపున తాగడం ద్వారా మధుమేహము, రక్తపోటు, కొలస్ట్రాల్ అదుపులో ఉంటాయి. 
- జ్వరం వచ్చినప్పుడు చిటికెడు పసుపుని గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే సరి. 
- మొటిమలకు పసుపు మంచి పరిష్కార మార్గం.
- రక్తశుద్ధికి పసుపు ఎంతగానో తోడ్పడుతుంది.  

పసుపు - వంటింటి చిట్కాలు
- పసుపును విరివిగా ఆహారంలో చేర్చడం మంచిది.
- పసుపుని గుమ్మాలకు రాయడం వల్ల ఇళ్లలోకి విషపురుగులు, క్రీమి కీటకాలు దరి చేరవు.
- పాదాళ్లకు రాసుకుంటే పగుళ్లు కూడా తగ్గుతాయి.
- ఏదైనా గాయమైనప్పుడు వెంటనే పసుపుని రాసుకుంటే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది.
- బాగా మరిగిన నీటిలో కాస్త పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. 

బొప్పాయి - ప్రయోజనాలు | బొప్పాయి - ఆరోగ్యం | బొప్పాయి - సౌందర్యం | బొప్పాయి - చిట్కాలు | Surprising Benefits of Papaya | VantintiChitkalu

బొప్పాయి పండులో విటమిన్ - ఎ పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ - బి1, విటమిన్ - బి2, విటమిన్ - బి3, విటమిన్ - సి, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.
బొప్పాయి - ఆరోగ్యం
- బాలింతలు బొప్పాయి పచ్చికాయను వండుకుని తినడం వల్ల వారిలో స్తన్యం ఎక్కువగా వస్తుంది.
- డెంగీ జ్వరం తో బాధ పడుతున్నప్పుడు ప్లేట్ లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు ఎంతో సహాయ పడుతుంది.
- నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు తలెత్తకుండా కాపాడుతుంది. 
- బొప్పాయి పండు తీసుకోవడంతో హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు. 
   ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తుంది.
- అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలకు బొప్పాయి చక్కని ఔషధం.
- జీర్ణకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నప్పుడు బొప్పాయి కాయలను కూరగా వండుకుని 
   క్రమంతప్పకుండా తింటూండవల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
- బొప్పాయి ఆహారాన్ని వెంటనే అరిగేలా చేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- రక్త ప్రసరణ పెరగడానికి, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.

బొప్పాయి - సౌందర్యం 
- బొప్పాయి మన చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది. దీని కారణంగా బ్యూటీక్రీమ్‌లు, 
   బ్యూటీ లోషన్లలో ఈ పండును విరివిగా వాడతారు.
- బొప్పాయి గుజ్జును మొహానికి పట్టించి కాసేపయ్యాక శుభ్రపరచడం వల్ల చర్మం కాంతులీనుతుంది.
- బొప్పాయి వృద్ధాప్య లక్షణాలను దరిచేరకుండా చూస్తుంది.

బొప్పాయి - చిట్కాలు
- బొప్పాయి ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.
- మాంసం త్వరగా ఉడకడానికి కొన్నిబొప్పాయి కాయ ముక్కలను కలిపితే సరి.
- ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకపోవడం, అతిగా భుజించడం, మానసిక ఒత్తిడి .. 
   వగైరా కారణాలు జీర్ణకోశాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు ఒక్కటే మార్గం.
- ఆకలి లేకపోవటం, నీరసంగా ఉండడం లక్షణాలకు బొప్పాయి పండు చక్కగా పనిచేస్తుంది.


శీతాకాలంలో చిన్నారులు | Winter safety tips for Parents and Kids | Keeping Children Safe in Cold Weather | VantintiChitkalu

చలి పులి
          - శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
          - చలికాలంలో ఉదయం ఎండ వచ్చేవరకు చిన్న పిల్లలు బయటకు రాకుండా ఉండడం ఉత్తమం.
          - చిన్నారుల ఆహారం విషయంలో సమయపాలన, తేలికగా జీర్ణమయ్యే వేడిగా, తాజా ఆహారం పెట్టాలి. 
             అవసరమైతే వైద్యుల సలహాలు పాటించాలి.
          - చర్మం పొడిబారకుండా ఉండేందుకు కోల్డ్ క్రీములు రాస్తూండాలి.
          - చలిని తట్టుకొనేవిధంగా ఒంటినిండా దుస్తులే కాకుండా స్వెట్టర్స్, గ్లౌజ్ లు, సాక్స్ లు వగైరా వేయాలి.
          - చెవులను కవర్ చేస్తూ తలకు చల్లగాలి తగలకుండా ఉండేందుకు ఉలన్ క్యాప్ లు వాడాలి.
చిత్రం: అంతర్జాలం

నిద్ర రావట్లేదా? | కమ్మని నిద్రకు చిట్కాలు | Healthy Sleep Tips | VantintiChitkalu

కమ్మని నిద్రకు..

- నిద్ర విషయంలో రోజూ కచ్చితమైన సమయం పాటించాలి. 
  ఆ సమయానికి ఎలాంటి ఆలోచనలకు, ఉద్రేకాలకు గురికాకుండా చూసుకోవాలి. 
  అంటే మొబైల్, టీవి, ఇంటర్నెట్.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండడమే మేలు. 
  అంతేకాకుండా పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. 
- రోజూ ఒకేచోట నిద్రపోవటం ఉత్తమం. 
- నిద్ర సమయానికి కచ్చితంగా రెండు గంటల ముందే డిన్నర్ ముగించాలి.
- పడుకున్నాక వెంటనే నిద్ర పట్టకపోతే మంచంపైనే అటూఇటూ దొర్లటం చేయకూడదు. 
  గదిలోంచి బయటకు వచ్చి పత్రికలు, పుస్తకాలు చదవటం మంచిది. 
- నిద్రకు ఉపక్రమించటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, 
  గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
- పడకగదిలో పరిమళభరితమైన అగరవత్తులు,  మంద్రమైన సంగీతం మంచి ఫలితం ఉంటుంది. 
  పడక గదిలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి.
- రోజూ వ్యాయామం, యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌.. వగైరా చేస్తే మంచిగా నిద్రపడుతుంది.
చిత్రం: అంతర్జాలం

చలికాలం - ఆహారం - చర్మ సౌందర్యం | Healthy Foods for Immunity-Boosting & Beautiful Skin in Winter | Food Tips for Cold Season | VantintiChitkalu

వెచ్చగా..
- చలికాలంలో ఇంటి ఆహారమే మేలు.  బయట ఫుడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 
   లేదంటే అనారోగ్యాలపాలు కాక తప్పదు.
- చలికాలంలో వేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి
- పౌష్టికాహారం పై దృష్టి పెట్టాలి. వెల్లుల్లిని ఎక్కువగా ఆహారంలో చేర్చాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సిట్రస్ జాతికి చెందిన పండ్లను కూడా  తీసుకోవాలి.
- ఈ కాలంలో చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. దీన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా సలాడ్‌లు ఎక్కువగా తీసుకోవాలి.
- టమాటాలు, బీట్రూట్‌, ఉసిరి రసాలు తీసుకుంటే చర్మంలోని తేమను కాపాడి మెరిసేలా చేస్తాయి.
- శరీరం డీ హైడ్రేషన్ కు గురియై చర్మం పొడిబారకుండా దాహం కాకున్నా మంచి నీరు తాగడం మంచిది.
- చలికాలంలో వ్యాయామాలు శరీరంలోని ఉష్ణోగ్రతలు పెంచి రక్తప్రసరణ మెరుగుపడేలా చూస్తాయి.