శీతాకాలం జాగ్రత్తలు | చలికాలంలో హెల్త్ ను కాపాడుకోవడం ఎలా? | Tips for winter wellness | VantintiChitkalu

ఎంత వెచ్చగా ఉందో..
శీతాకాలం వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకని తినే ఆహారం, వేసుకునే దుస్తులు వగైరా తప్పక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాదారణంగా చలికాలం పెదవులు, పాదాలు పగలడం జరుగుతుంది. చల్లని గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి ఎల్లప్పుడు ముఖం, శరీరం అంతా మాయిశ్చరైజ్డ్ గా ఉంచాలి.

- తెలిసిందే అయినా నిర్లక్ష్యం చేయకుండా చేతులు శుభ్రంగా తరచూ కడుక్కోవడం వల్ల జెమ్స్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రధమ మార్గం అని గమనించాలి. టాయిలెట్ కు వెళ్ళినప్పుడు, భోజనం ముందు, అలాగే ప్రతి కొన్ని గంటలకు చేతులు కడగడం తప్పనిసరి అని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఆఫీసులో డోర్ హ్యండిల్స్, ఫోన్, కీబోర్డు తాకిన తర్వాత కూడా చేతులు వాష్ చేసుకోవడం ఉత్తమం.

- సీజనల్ ఫ్లూస్, ముఖ్యంగా స్వైన్ ఫ్లూ లాంటివి సోకకుండా నివారించడానికి వాక్సినేషన్ చేయించుకోవాలి. గర్భవతి, వయసుపైపడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యం పాలైనవారికి తప్పనిసరి.

- చలికాలం ఏమాత్రం బద్దకించకుండా చేయాల్సింది వ్యాయామం. కాబట్టి ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ చేయడం ఉత్తమం. బయట చలి అనుకుంటే వ్యాయామశాలకు వెళ్ళాలి.
బాగా తిను

-  ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంపొందించాలి. కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. వగైరా శరీరానికి తప్పక అందాలి. ఐరన్, జింక్ మరియు విటమిన్ సి కూడా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకమైనవి. సాధ్యమైనంతవరకు బయటి ఫుడ్ కి దూరంగా ఉంటూ హోమ్ మేడ్ ఆహారం, సూప్ లు వేడివేడిగా తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

- దాహం వేయడం లేదని, మరియేతర కారణం చేతనైనా మంచినీరు తీసుకోకపోవడం సరికాదు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి. అయితే కచ్చితంగా కాచిచల్లార్చిన మంచినీరే వాడాలి. గోరువెచ్చని నీరు ఈ చలి కాలంలో వెచ్చదనం కలిగించడంతో పాటూ అనారోగ్యాలపాలు కాకుండా కాపాడుతుంది.

- నిద్రను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన విశ్రాంతి తప్పనిసరి. లేదంటే ఇట్టే జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
చిత్రం: అంతర్జాలం

No comments: