బుల్ హార్ట్ - ఎ కస్టర్డ్ యాపిల్
హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే రామాఫలం పండ్ల తొక్క సీతాఫలంకన్నా బొడిపెలు తక్కువగా ఉంటాయి. మధురమైన వాసన, రుచిని కలిగి ఉండే ఈ నెట్టెడ్ కస్టర్డ్ యాపిల్ సీతాఫలంతో పోలిస్తే గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పుష్కలమైన పోషక విలువల్లో ప్రధానమైనవి విటమిన్ సి, విటమిన్ బి -కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్. ఈ కారణంగా నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ బుల్లక్ హార్ట్ పండుకి ఎక్కువే.
No comments:
Post a Comment