వరల్డ్ స్మైల్ డే | World Smile Day | Happy Fun Holiday | ప్రపంచ నవ్వుల దినోత్సవం | Vantinti Chitkalu

వ్వండి.. వ్వించండీ..😆
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. ఆరోగ్యానికి నవ్వు ఒక టానిక్‌. నవ్వు వల్ల ఎండోర్ఫిన్‌ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక వత్తిడిని  సైతం తగ్గించడానికి తోడ్పడుతాయి. తద్వారా శరీరంలో రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చు.

నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా ఏపని అయినా చురుగ్గా చేసుకోగలుగుతాం. నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం అని గమనించాలి. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవ్వు వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అక్కడ ఆనందం వెల్లివెరిస్తుంది. మనుషుల మధ్య నమ్మకం పెంపొందించబడుతుంది. నవ్వు వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

అందుకే నవ్వు నాలుగు విధాల మేలు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట కూడా. మరి ఏ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయో.. నవ్వులు పువ్వులు పూయిస్తాయో చూస్కోండి మరి.

#SmileDay : First Friday of October

No comments: