వంటింటి చిట్కాలు
ఏ కాలంలోనైనా గోరువెచ్చని మంచినీరు శ్రేయష్కరం. జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. తద్వారా శ్వాస క్రియ మెరుగుపడుతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నవారు రోజులో చాలా సార్లు గోరువెచ్చటి నీరు తీసుకున్నట్లయితే గొంతులో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
- పడిశం నుంచి విముక్తికి వేడినీళ్లలో కాస్త పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టడం ఎంతో మంచిది.
పైగా చర్మం శుద్ధిపడి ముఖవర్చస్సు ఇనుమడింపచేస్తుంది.
- వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
- గొంతునొప్పి, టాన్సిల్స్ సమస్యలకు గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం ఉపశమనంగా ఉంటుంది.
- కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, అధిక బరువు .. వగైరా సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
- తలనొప్పిని ఇట్టే వదిలించుకోవడానికి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపి తీసుకోండి.
- కళ్లు పొడిబారడం, దురదలు ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో ఒక వస్త్రాన్ని ముంచి కళ్ల పై 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరి.
- గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగుపడడంతో చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.
- స్నానానికి కూడా చల్లనివి, మరిగే నీళ్ళ కంటే గోరువెచ్చటి నీటిని ఉపయోగించడం చాలా మంచిది.
- చర్మం పై పగుళ్ళు, ఇతర చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినపుడు త్వరితగతిన నయమవడానికి సబ్బుతో బాగారుద్ది గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి.
చిత్రం: అంతర్జాలం
No comments:
Post a Comment