చలికాలంలో మీ పెదవులు పగలకుండా కాపాడుకోవడమెలా.. | వింటర్ టిప్స్ | Best Home Remedies to Treat the Dry Cracked Chapped Lips in Winter | VantintiChitkalu

ఇలా చేస్తే అధరాలు పదిలం..
చల్లటి గాలికి చర్మం పొడిబారతుంది. ముఖ్యంగా పెదవులు చిట్లడానికి కారణం అవుతుంది. పైగా శీతాకాలంలో శరీరం మొత్తం వివిధ దుస్తులతో చలిబారిన పడకుండా కాపాడుకోగలం కానీ పెదవులకు ఆ అవకాశం లేదు. అంతేకాకుండా లిప్స్ సున్నితమైన చర్మం కలిగి ఉండడంతో ముఖం మీద మిగిలిన చర్మం కంటే పది రెట్లు వేగంగా ఆరిపోతాయి. అందువల్ల వాటి రక్షణకు అదనపు జాగ్రత్తలు అవసరం. మీ పెదాలను శీతాకాలంలోనూ సున్నితంగా, సుందరంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు మీ కోసం..
- పెదవులను కొరకకూడదు. అలవాటును వెంటనే మానుకోవాలి. పెదవులు పొడిగా ఉన్నప్పుడు, వాటిని తేమగా ఉంచాలని లాలాజలం రాయకూడదు. దీనివల్ల పెదవులు మరింత పొడిగా మారుతాయి. ఆహారం జీర్ణం కావటానికి ఉపయోగపడే లాలాజలంలో ఉన్న ఎంజైములు పెదవులకి మరింత హాని తలపెడతాయి.
- పెట్రోలియం, ప్రత్యేకమైన నూనెలు,  గ్లిసరిన్ కలిగిన లేపనం ఈ కాలంలో పెదవులకు తప్పక వాడుకోవాలి. దీనివల్ల చర్మం లో పగుళ్ళు నివారించబడుతాయి. చలికాలంలోనైనా బయటికి వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడుకోవాలి.
- కర్పూరం, యూకలిప్టస్, మెంతాల్ లను కలిగి ఉన్న లిప్ బామ్ లను వాడకూడదు. వీటి వల్ల పెదవులు ఎండిపోయి సమస్య మరింత దిగజారుస్తుంది.
- పెదవులు పెళుసులు, పొరలుగా ఉన్నప్పుడు వాటిని రుద్దడం, దంతాలతో, వేళ్ళతో చర్మంను తీసివేయడం మంచిది కాదు. దీనివల్ల పెదవులమీద పగుళ్లు, పుళ్ళు పడతాయి. ముందుగానే పెదవులు పొడిబారిన పడకుండా చూసుకోవాలి. అవసరమైతే మెడికేటెడ్ లిప్ బామ్ లను వాడుకోవాలి.
- చాలామంది మహిళలు పెదవుల మేకప్ కోసమని కాస్మోటిక్స్‌ ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి లిపిస్టిక్‌ వంటి కాస్మోటిక్స్‌ వల్ల పెదవులు పాడవుతాయి. నల్లగా మారతాయి.  
- రాత్రి పడుకునే ముందు పెదవులకు కచ్చితంగా లిప్ గార్డ్ రాసుకోవడం ఉత్తమం అని నిఫుణులు సూచిస్తున్నారు.
చిత్రం: అంతర్జాలం

No comments: