సీతాఫలం - నిండు ఆరోగ్యం
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణాఫలం.. ఇలా మనకు ఉన్నా విరివిగా అందుబాటులో ఉండేవి సీతాఫలం ఒక్కటే. సీతాఫలంలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. తిన్న వెంటనే శక్తినిచ్చే ఈ పండులో ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్నీషియం తదితర పోషకాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో ఇన్ఫెక్షన్ దరిచేరినప్పుడు, శస్త్ర చికిత్స తరువాత సీతాఫలం ఎంతోమేలు చేస్తుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఉంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది. ఆజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. బి6 విటమిన్ కారణంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తాయి. సీతాఫలాలు కీళ్లనొప్పుల నివారణకు ఉపయోగపడతాయి. డయాబెటిస్ దరి చేరనివ్వదు. దంతాలకు మంచి ఆహారం. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా పనిచేస్తాయి. ఐరన్ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియాకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. శీతాకాలంలోనే లభించే ఫలం కస్టర్డ్ యాపిల్. కనుక నిస్సందేహంగా మోతాదు మించకుండా తినేద్దామా..
No comments:
Post a Comment