చుండ్రు నివారణ కోసం | How to Get Rid of Dandruff | Natural Treatments | VantintiChitkalu

శీతాకాలం వచ్చింది. 
డాన్డ్రఫ్ సమస్య మొదలవుతుంది.
ఈ కాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల జుట్టు త్వరగా పొడిబారిపోయి నిర్జీవంగా మారిపోతుంది. తలలో ఇన్‌ఫెక్షన్ సోకడం, చ‌ర్మం పొడిబారిపోవ‌డం, స‌రైన శుభ్రత పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఫైగా ఏవేవో షాంపూలు, క్రీములు రాసి చుండ్రును వ‌దిలించుకోవాల‌ని సమస్యను మరింత జఠిలం చేసుకోకూడదు. స‌హ‌జ సిద్ధమైన కుంకుడుకాయ రసం, కొబ్బరినూనె, పెరుగు, నిమ్మకాయ వగైరా మాత్రమే వాడుతూ చుండ్రు స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డాలి. అంతే కాకుండా ఈ చిట్కాలు మీ కోసమే..!

- శారీరక, మానసిక ఆరోగ్యం మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. అందుకని సంపూర్ణ ఆహారం తో పాటూ సరియైన నిద్ర అవసరం.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ రోగనిరోధక శక్తిని ఇనుమడింప చేసుకోవాలి.
- చలివేస్తుందని ఎక్కువ వేడి నీటి తో తల స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీరు శ్రేయష్కరం.
- హెయిర్ డ్రయర్ వాడకపోవడం ఉత్తమం. వాడవలసి వస్తే తక్కువ ఉష్ణోగ్రతలోనే వాడుకోవాలి.
- తరచూ తప్పకుండా దువ్వెన, హెయిర్ బ్రష్ లను వెనిగర్ తో శుభ్రపరచాలి.
- పంటి వరుస సరిగా ఉన్న దువ్వెనను జుట్టు దువ్వుకోవడానికి ఉపయోగించాలి.
- షాంపూలు, క్రీం లు కొత్తవి వాడుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. లేదంటే అలెర్జీలు దరిచేరుతాయి.
- చుండ్రు ఉందికదా అని రోజూ యాంటి డాన్డ్రఫ్ షాంపూ వాడకూడదు.
- కండీషనర్ ను కనీసం మూడు సార్లు వారానికి వాడుతూ జుట్టును తేమ కోల్పోకుండా చూసుకోవాలి.
- ఎండకు ఎక్స్పోజ్ కాకుండా జుట్టును కవర్ చేస్తూ స్కార్ఫ్ వాడుకోవాలి.
- తల గోకడం మానుకోవాలి.

 
చిత్రం: అంతర్జాలం

No comments: