ఎగ్ ఈజ్ వెరీ 'గుడ్డు'
ప్రపంచ వ్యాప్తంగా పౌల్ట్రీరంగం మీద అవగాహనను ప్రజలలో పెంపొందించేందుకు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ప్రతీ ఏడాదీ అక్టోబర్ నెలలో రెండవ శుక్రవారాన్ని ప్రపంచ గుడ్డు దినోత్సవంగా ప్రకటించింది. వయసు తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ నిత్యం కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు ద్వారా లభిస్తాయి. ఎదిగేపిల్లలకు శక్తినిస్తుంది. ముఖ్యంగా ఇందులోని విటమిన్ బి–12 శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రయేజనకరం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణానికి, శరీరానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది.
No comments:
Post a Comment