శుభాకాంక్షలతో..
మహాత్మా గాంధీ ఉదయాన్నే గుజరాత్ వీధుల్లో చీపురుతో మురికి వాడలను శుభ్రపరచేవారు. రాత్రి అయ్యేసరికి ప్రజలు మళ్లీ పాడు చేసేవారు. తిరిగి తెల్లారేసరికి రోడ్లన్ని శుభ్రంగా మారిపోయేవి. ఆయా ప్రాంత వాసులు ఒక పెద్దాయన తెల్లవారు జామునే వీధులను తుడవటం చూసి సిగ్గుపడి రోడ్లను పాడుచెయ్యటం మానుకుని వారూ పరిశుభ్రత పాటించటంలో కృషి చేసారట. ఈ విషయం మనలో ఎవరికి తెలియంది కాదు. పరిసరాల పరిశుభ్రత అంటూ రెండు, మూడు తరగతుల్లోనే చదువుకున్నాం. కానీ ఆచరించడం మర్చిపోయాం. నేటి ప్రధాని గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డపై పుట్టారు కాబట్టి మహాత్ముని స్పూర్తితో స్వచ్చ భారత్ రూపొంచించడం జరిగింది. సరే ఇలాంటి కార్యక్రమాలు మనకు కొత్తేం కాదు. గతంలో క్లీన్ అండ్ గ్రీన్, జన్మ భూమి లాంటి పధకాలు చూశాం. ఏది సాధించాలన్నా పధకం ప్రకటించినప్పటినుంచి సమర్ధవంతంగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధించేంతవరకు చిత్తశుద్ధి లోపించని ప్రభుత్వాలతో పాటూ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం తప్పనిసరి. 2019లో జరిగే మహాత్మా గాంధీ 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలనాటికి భారత దేశం అన్ని విధాల స్వచ్ఛత సాదించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటూ ప్రతీఒక్కరు సంకల్పించాల్సిన అవసరం ఉంటుంది.
No comments:
Post a Comment