సీజనల్ సమస్యలకు జబర్దస్త్ చిట్కా | Jabardasth Tip for body warm during the Winter Season | VantintiChitkalu

వంటింటి చిట్కాలు

ఏ కాలంలోనైనా గోరువెచ్చని మంచినీరు శ్రేయష్కరం. జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. తద్వారా శ్వాస క్రియ మెరుగుపడుతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నవారు రోజులో చాలా సార్లు గోరువెచ్చటి నీరు తీసుకున్నట్లయితే గొంతులో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
 
- పడిశం నుంచి విముక్తికి వేడినీళ్లలో కాస్త పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టడం ఎంతో మంచిది. 
   పైగా చర్మం శుద్ధిపడి ముఖవర్చస్సు ఇనుమడింపచేస్తుంది.
- వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
- గొంతునొప్పి, టాన్సిల్స్‌ సమస్యలకు గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం ఉపశమనంగా ఉంటుంది.
- కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, అధిక బరువు .. వగైరా సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
- తలనొప్పిని ఇట్టే వదిలించుకోవడానికి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపి తీసుకోండి.
- కళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో ఒక వస్త్రాన్ని ముంచి కళ్ల పై 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరి.
- గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగుపడడంతో చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.
- స్నానానికి కూడా చల్లనివి, మరిగే నీళ్ళ కంటే గోరువెచ్చటి నీటిని ఉపయోగించడం చాలా మంచిది. 
- చర్మం పై పగుళ్ళు, ఇతర చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినపుడు త్వరితగతిన నయమవడానికి సబ్బుతో బాగారుద్ది గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి.
 
చిత్రం: అంతర్జాలం

ఆరోగ్య సిరికి ఉసిరి కాయ | Amazing Amla Health & Beauty Benefits | Indian gooseberry | VantintiChitkalu

కఫం, వాతం, పైత్యం .. త్రిదోషాలకు ఉసిరి తో చెక్..!
 
ఈ కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం. చలికాలంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అపురూప కానుక ఉసిరి. అందం, ఆరోగ్యం ఉసిరి ద్వారా మనం సొంతం చేసుకోవచ్చు. ఉసిరి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. వీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉసిరికాయలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస్ వీటితోనే తయారుచేస్తారు.
- ఉసిరికాయ రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
- ఉసిరికాయ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- ఉసిరికాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. 
   గొంతు సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.
- ఉసిరి శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువును నియంత్రిస్తుంది.
- ఉసిరిని హెయిర్ ఆయిల్ లో కలిపి రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
   వీటి గింజల పౌడర్, నీమ్మరసం కలిపి తలకు పట్టిస్తే పేలు ఇట్టే రాలిపోతాయి.
- గ్యాస్ సమస్య, మధుమేహం, అస్తమ రోగులు.. ఎవరికైన ఉసిరి చక్కని ఔషధం అని గమనించాలి.
- ఉసిరి యూరినరి ఇన్ఫెక్షన్ తగ్గించటంలో ఉపయోగకారి.
 
చిత్రం: అంతర్జాలం

చలికాలంలో మీ పెదవులు పగలకుండా కాపాడుకోవడమెలా.. | వింటర్ టిప్స్ | Best Home Remedies to Treat the Dry Cracked Chapped Lips in Winter | VantintiChitkalu

ఇలా చేస్తే అధరాలు పదిలం..
చల్లటి గాలికి చర్మం పొడిబారతుంది. ముఖ్యంగా పెదవులు చిట్లడానికి కారణం అవుతుంది. పైగా శీతాకాలంలో శరీరం మొత్తం వివిధ దుస్తులతో చలిబారిన పడకుండా కాపాడుకోగలం కానీ పెదవులకు ఆ అవకాశం లేదు. అంతేకాకుండా లిప్స్ సున్నితమైన చర్మం కలిగి ఉండడంతో ముఖం మీద మిగిలిన చర్మం కంటే పది రెట్లు వేగంగా ఆరిపోతాయి. అందువల్ల వాటి రక్షణకు అదనపు జాగ్రత్తలు అవసరం. మీ పెదాలను శీతాకాలంలోనూ సున్నితంగా, సుందరంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు మీ కోసం..
- పెదవులను కొరకకూడదు. అలవాటును వెంటనే మానుకోవాలి. పెదవులు పొడిగా ఉన్నప్పుడు, వాటిని తేమగా ఉంచాలని లాలాజలం రాయకూడదు. దీనివల్ల పెదవులు మరింత పొడిగా మారుతాయి. ఆహారం జీర్ణం కావటానికి ఉపయోగపడే లాలాజలంలో ఉన్న ఎంజైములు పెదవులకి మరింత హాని తలపెడతాయి.
- పెట్రోలియం, ప్రత్యేకమైన నూనెలు,  గ్లిసరిన్ కలిగిన లేపనం ఈ కాలంలో పెదవులకు తప్పక వాడుకోవాలి. దీనివల్ల చర్మం లో పగుళ్ళు నివారించబడుతాయి. చలికాలంలోనైనా బయటికి వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడుకోవాలి.
- కర్పూరం, యూకలిప్టస్, మెంతాల్ లను కలిగి ఉన్న లిప్ బామ్ లను వాడకూడదు. వీటి వల్ల పెదవులు ఎండిపోయి సమస్య మరింత దిగజారుస్తుంది.
- పెదవులు పెళుసులు, పొరలుగా ఉన్నప్పుడు వాటిని రుద్దడం, దంతాలతో, వేళ్ళతో చర్మంను తీసివేయడం మంచిది కాదు. దీనివల్ల పెదవులమీద పగుళ్లు, పుళ్ళు పడతాయి. ముందుగానే పెదవులు పొడిబారిన పడకుండా చూసుకోవాలి. అవసరమైతే మెడికేటెడ్ లిప్ బామ్ లను వాడుకోవాలి.
- చాలామంది మహిళలు పెదవుల మేకప్ కోసమని కాస్మోటిక్స్‌ ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి లిపిస్టిక్‌ వంటి కాస్మోటిక్స్‌ వల్ల పెదవులు పాడవుతాయి. నల్లగా మారతాయి.  
- రాత్రి పడుకునే ముందు పెదవులకు కచ్చితంగా లిప్ గార్డ్ రాసుకోవడం ఉత్తమం అని నిఫుణులు సూచిస్తున్నారు.
చిత్రం: అంతర్జాలం

చుండ్రు నివారణ కోసం | How to Get Rid of Dandruff | Natural Treatments | VantintiChitkalu

శీతాకాలం వచ్చింది. 
డాన్డ్రఫ్ సమస్య మొదలవుతుంది.
ఈ కాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల జుట్టు త్వరగా పొడిబారిపోయి నిర్జీవంగా మారిపోతుంది. తలలో ఇన్‌ఫెక్షన్ సోకడం, చ‌ర్మం పొడిబారిపోవ‌డం, స‌రైన శుభ్రత పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఫైగా ఏవేవో షాంపూలు, క్రీములు రాసి చుండ్రును వ‌దిలించుకోవాల‌ని సమస్యను మరింత జఠిలం చేసుకోకూడదు. స‌హ‌జ సిద్ధమైన కుంకుడుకాయ రసం, కొబ్బరినూనె, పెరుగు, నిమ్మకాయ వగైరా మాత్రమే వాడుతూ చుండ్రు స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డాలి. అంతే కాకుండా ఈ చిట్కాలు మీ కోసమే..!

- శారీరక, మానసిక ఆరోగ్యం మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. అందుకని సంపూర్ణ ఆహారం తో పాటూ సరియైన నిద్ర అవసరం.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ రోగనిరోధక శక్తిని ఇనుమడింప చేసుకోవాలి.
- చలివేస్తుందని ఎక్కువ వేడి నీటి తో తల స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీరు శ్రేయష్కరం.
- హెయిర్ డ్రయర్ వాడకపోవడం ఉత్తమం. వాడవలసి వస్తే తక్కువ ఉష్ణోగ్రతలోనే వాడుకోవాలి.
- తరచూ తప్పకుండా దువ్వెన, హెయిర్ బ్రష్ లను వెనిగర్ తో శుభ్రపరచాలి.
- పంటి వరుస సరిగా ఉన్న దువ్వెనను జుట్టు దువ్వుకోవడానికి ఉపయోగించాలి.
- షాంపూలు, క్రీం లు కొత్తవి వాడుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. లేదంటే అలెర్జీలు దరిచేరుతాయి.
- చుండ్రు ఉందికదా అని రోజూ యాంటి డాన్డ్రఫ్ షాంపూ వాడకూడదు.
- కండీషనర్ ను కనీసం మూడు సార్లు వారానికి వాడుతూ జుట్టును తేమ కోల్పోకుండా చూసుకోవాలి.
- ఎండకు ఎక్స్పోజ్ కాకుండా జుట్టును కవర్ చేస్తూ స్కార్ఫ్ వాడుకోవాలి.
- తల గోకడం మానుకోవాలి.

 
చిత్రం: అంతర్జాలం

శీతాకాలం జాగ్రత్తలు | చలికాలంలో హెల్త్ ను కాపాడుకోవడం ఎలా? | Tips for winter wellness | VantintiChitkalu

ఎంత వెచ్చగా ఉందో..
శీతాకాలం వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. అందుకని తినే ఆహారం, వేసుకునే దుస్తులు వగైరా తప్పక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాదారణంగా చలికాలం పెదవులు, పాదాలు పగలడం జరుగుతుంది. చల్లని గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి ఎల్లప్పుడు ముఖం, శరీరం అంతా మాయిశ్చరైజ్డ్ గా ఉంచాలి.

- తెలిసిందే అయినా నిర్లక్ష్యం చేయకుండా చేతులు శుభ్రంగా తరచూ కడుక్కోవడం వల్ల జెమ్స్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రధమ మార్గం అని గమనించాలి. టాయిలెట్ కు వెళ్ళినప్పుడు, భోజనం ముందు, అలాగే ప్రతి కొన్ని గంటలకు చేతులు కడగడం తప్పనిసరి అని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఆఫీసులో డోర్ హ్యండిల్స్, ఫోన్, కీబోర్డు తాకిన తర్వాత కూడా చేతులు వాష్ చేసుకోవడం ఉత్తమం.

- సీజనల్ ఫ్లూస్, ముఖ్యంగా స్వైన్ ఫ్లూ లాంటివి సోకకుండా నివారించడానికి వాక్సినేషన్ చేయించుకోవాలి. గర్భవతి, వయసుపైపడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యం పాలైనవారికి తప్పనిసరి.

- చలికాలం ఏమాత్రం బద్దకించకుండా చేయాల్సింది వ్యాయామం. కాబట్టి ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ చేయడం ఉత్తమం. బయట చలి అనుకుంటే వ్యాయామశాలకు వెళ్ళాలి.
బాగా తిను

-  ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంపొందించాలి. కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. వగైరా శరీరానికి తప్పక అందాలి. ఐరన్, జింక్ మరియు విటమిన్ సి కూడా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకమైనవి. సాధ్యమైనంతవరకు బయటి ఫుడ్ కి దూరంగా ఉంటూ హోమ్ మేడ్ ఆహారం, సూప్ లు వేడివేడిగా తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

- దాహం వేయడం లేదని, మరియేతర కారణం చేతనైనా మంచినీరు తీసుకోకపోవడం సరికాదు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి. అయితే కచ్చితంగా కాచిచల్లార్చిన మంచినీరే వాడాలి. గోరువెచ్చని నీరు ఈ చలి కాలంలో వెచ్చదనం కలిగించడంతో పాటూ అనారోగ్యాలపాలు కాకుండా కాపాడుతుంది.

- నిద్రను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన విశ్రాంతి తప్పనిసరి. లేదంటే ఇట్టే జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
చిత్రం: అంతర్జాలం

మొక్కలు జంతువులను భక్షిస్తాయా..! | What kind of plants eat meat? | What are the plants that eat insects? | VantintiChitkalu

మాంసాహార మొక్కలు..!
ఇంట్లో దోమలు ఇబ్బంది పెడెతుంటే ఏం చేస్తాం. మస్కిటో బ్యాట్ తో దోమల వేట సాగిస్తాం. ఇక ఈగలు, కీటకాలు మన పరసరాల్లోకి రాకుండా ఉండాలంటే క్రిమీసంహారాలను వాడవలసిందే. 
అయితే ఈ బాధల నుండి విముక్తికి ఒక్క మొక్క పెంచండి ఈగలు, దోమలు, క్రిమీకీటకాల పీకలు కోసేస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా!. మొక్కకి నీరు, గాలి తప్ప వీటి అవసరం ఏంటి అనుకుంటున్నారా? ఇక విషయంలోకి వస్తే.. మొక్కల్లో మాంసాహార మొక్కలు వేరయా.. అన్నట్టు సరిగ్గా ఇదే కోవకు చెందిన వీనస్ ఫ్లైట్రాప్ మొక్క ఈ కీటకాలను పట్టుకోవడమే కాదు. ఇంచంకా భుజించి ఆరగించుకుంటుంది కూడా. ఇంకా ఇది మొక్కే కదాని అనుకుంటే పొరపాటు ఏకంగా  కొన్ని జాతుల పక్షులు, ఎలుకలు, కప్పలు వంటి జంతువులను కూడా ఇంచక్కా ఆరగించేస్తుంది.
ఈ అసహజమైన మొక్కలను చార్లెస్ డార్విన్ కనుగొన్నారు. ఇప్పుడైతే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 700లకు పైచిలుకు జాతులే ఉన్నాయని ఒక అధ్యాయణం. వీటిలో ముఖ్యమైనవి వీనస్ ఫ్లైట్రాప్, పిట్చెర్ ప్లాంట్, సండె మొదలైనవి. మన దేశంలో మేఘాలయలోని కొండ ప్రాంతాలలో మంకీ కప్ అనే ఒకే రకమైన మొక్కలున్నాయి. ఇవి సాధారణంగా భూమిలో సారంలేని, అవసరమైన పోషకాలు లభించని ప్రాంతాల్లో పెరుగుతాయి. అందుకే మనుగడ కోసం మాంసాహారం పై ఆధారపడతాయి. అందుకు అనుకూలంగా వీటి నిర్మాణం ఉంటుంది.  ఈ మొక్కల ఆకులు కీటకాలను ఆకర్షించేలా వాటికి ఉచ్చు బిగించేలా ఏర్పడి ఉంటాయి. ప్రత్యేకమైన ఎంజైమ్ లను స్రవంచి వీటిని ఇంచక్కా తినేస్తాయి.



చిత్రం: అంతర్జాలం

దీపావళి జాగ్రత్తలు..! | Safety Tips for Lighting Fireworks | టపాకాయలు | బాణాసంచా | టపాసులు | Diwali Crackers | VantintiChitkalu

జీవితాల్లో వెలుగును నింపే దీపావళి..!


దీపావళి పండుగ అనగానే అందరికీ, ముఖ్యంగా పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. టపాకాయలు కాల్చుతూ ఆనందంతో ఉరకలేస్తుంటారు. ఈ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదు. అందుకే పిల్లలను కనిపెడుతూ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
- టపాసులు కాల్చేవేళ కాటన్ దుస్తులు, ఎక్కువ వదులుగా లేనివి ధరించాలి. ఒక వేళ నిప్పురవ్వలు పడినా మంటలు త్వరగా వ్యాపించవు.
- టపాసులకు పసి పిల్లలను, వృద్దులను, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారిని దూరంగా ఉంచాలి.
- టపాసులు కాల్చేటప్పుడు పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి.
- ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. ఇల్లు, అపార్ట్మెంట్, వీధుల్లో బాణాసంచా కాల్చరాదు.
- గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ ల వద్ద టపాసులు ఉంచరాదు.
- క్రాకర్స్ శబ్దాలతో చెవులు గిళ్ళుమనకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా చెవులలో దూది పెట్టుకోవడం ఉత్తమం. దీని వల్ల కర్ణభేరికి హాని జరగకుండా ఉంటుంది.
- చిన్నచిన్న ప్రమాదాలను తప్పిచ్చడానికి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలి.
- ఈ ఆనంద సమయాన ఏమరుపాటుతో ప్రమాదాలను కొనితెచ్చుకోకుండా ఉండడమే కాక, ఇతరులకు, పక్షులకు, జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి.
- శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వగైరాలు తలెత్తకుండా పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలి.

లక్ష్మణ ఫలం - క్యాన్సర్ కు లక్ష్మణరేఖ | హనుమ ఫలం | Cancer Cure by Soursop | Graviola | Hanuman Phal | Laxman Phal | VantintiChitkalu

లక్ష్మణ ఫలంతో క్యాన్సర్ కు చెక్
లక్ష్మణ ఫలం (హనుమ ఫలం) బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు కానీ సీతాఫలం, రామఫలంలా కాకుండా ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ. పైగా పండుపైన బొడిపెలు ముళ్లవలే తేలిఉంటాయి. అందుకని లక్ష్మణ ఫలాన్నినేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకోవడం మేలు. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం. లక్ష్మణ ఫలంలో పదికి పైగా రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధనలు వెళ్లడించాయి. దీనికి కారణం ఇందులో అనినోషియన్ అసిటోజిన్ పుష్కలంగా ఉండడం. రేడియేషన్, ఖీమో థెరపీల కన్నా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను ఎక్కువ రెట్లు నిర్మూలించగలవు. లక్ష్మణ ఫలం ఆకులు, కాయలు క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు. క్యాన్సర్ మొదటి దశలో ఉన్న వారికి ఆకులు కషాయంగా తయారుచేసి తేనీరులా తాగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని ఇనుమడింప చేసే ఈ ఫలం కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం, నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటుకు చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి.

రామాఫలం - ఎ కస్టర్డ్‌ యాపిల్‌ | Ramaphal Cancer Killer Fruit | VantintiChitkalu

బుల్ హార్ట్ - ఎ కస్టర్డ్‌ యాపిల్‌

హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే రామాఫలం పండ్ల తొక్క సీతాఫలంకన్నా బొడిపెలు తక్కువగా ఉంటాయి. మధురమైన వాసన, రుచిని కలిగి ఉండే ఈ నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌ సీతాఫలంతో పోలిస్తే గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పుష్కలమైన పోషక విలువల్లో ప్రధానమైనవి విటమిన్ సి, విటమిన్‌ బి -కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌. ఈ కారణంగా నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ బుల్లక్‌ హార్ట్‌ పండుకి ఎక్కువే. 

సీతాఫలాల సీజన్‌ వచ్చేసింది.. | Amazing Health Benefits Of Custard Apple | Sugar Apple | VantintiChitkalu

సీతాఫలం - నిండు ఆరోగ్యం
 
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణాఫలం.. ఇలా మనకు ఉన్నా విరివిగా అందుబాటులో ఉండేవి సీతాఫలం ఒక్కటే. సీతాఫలంలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి.  తిన్న వెంటనే శక్తినిచ్చే ఈ పండులో ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్నీషియం తదితర పోషకాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో ఇన్ఫెక్షన్‌ దరిచేరినప్పుడు, శస్త్ర చికిత్స తరువాత సీతాఫలం ఎంతోమేలు చేస్తుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఉంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది. ఆజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. బి6 విటమిన్‌ కారణంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తాయి. సీతాఫలాలు కీళ్లనొప్పుల నివారణకు ఉపయోగపడతాయి. డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. దంతాలకు మంచి ఆహారం. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా పనిచేస్తాయి. ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియాకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. శీతాకాలంలోనే లభించే ఫలం కస్టర్డ్‌ యాపిల్‌. కనుక నిస్సందేహంగా మోతాదు మించకుండా తినేద్దామా..




అక్టోబరు 16: ప్రపంచ ఆహార దినం | World Food Day | VantintiChitkalu

ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకుంటున్నారా..
ఆహారం ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు, రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా చెప్పుకోవచ్చు. 
 


మీ జుత్తు రాలిపోతోందా? .. తల వెంట్రుకలు నెరసిపోతున్నాయా? | నిగనిగలాడే జుట్టును సొంతం చేసుకోండి.. | Hair Hacks Every Girl Should Know | VantintiChitkalu

మీకు తెలియని రహాస్యం ఏంటో మీరే చూడండి..
చాలా మందిలో ఇప్పుడు నెలకొని ఉన్న ప్రధాన సమస్య వెంట్రుకలు రాలిపోవడం, తెల్ల పడడం. ఇక దీనికి తోడు ఇలా సమస్య మొదలవడంతోనే జీవితాన్నే కోల్పోయినట్టుగా బాధపడడం.. పర్యవసానం ఈ సమస్య నేటి యువతలో మరింత జఠిలం అవుతోంది.. దీని అంతటికి మూల కారణం ఈ పోటీ ప్రపంచంలో తగిన విశ్రాంతి లేకపోవడం, అనుక్షణం అలోచనలు, మారుతున్న అహారపు అలవాట్లు..  ఇవన్ని మీ జుట్టుపై ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..

వయసుతో పాటు జుట్టు నెరవడం, పలచబడడం సహజమే. కాని చిన్నవయసులోనే బట్టతల, తల పండిపోవడం అసహజం. సగటున జుట్టు రోజుకు 0.4 mm పెరుగుతుంది. తల మీద ఒత్తైన జుట్టు ఎండ, UV కిరణాల నుండి రక్షణ కల్పించి మనల్నిచల్లగా, సురక్షితంగా ఉంచుతుంది. మీ తలపై ఒక్కో వెంట్రుక 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే రోజూ కనీసం 50 నుండి 100 వెంట్రుకలు ఊడిపోతాయి. నెత్తిమీది జుట్టు శరీరాగ్యోనికి ఐకాన్ లాంటిది. జుట్టు నల్లత్రాచులా పెరగడానికి సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, విశ్రాంతి తప్పనిసరి గుర్తించాలి. జుట్టు యొక్క మూలం ఫోలికల్ వంటి ట్యూబ్లో ఉంటుంది. ఇది మెలనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే పిగ్మెంట్ కణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ రసాయనం జుట్టుకి నల్లని రంగు సంతరించుకునేలా చేస్తుంది. ఈ వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడంతోనే జుట్టు నెరవడం జరుగుతుంది.

హెయిర్ ఒక అద్భుతమైన సహజ వనరు. ఇది ఇనుము అంత బలమైనది కూడా. అందుకే భవిష్యత్తులో సైన్యం రక్షక దుస్తులను సైతం జుట్టుతో తయారు చేయాలనే పనిలో పడ్డారు పరిశోధకులు. ఇన్ని రహాస్యాలు దాగి ఉన్న జుట్టును కాపాడుకోవడమెలా అంటారా.. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాలతో తయారైన పదార్థాలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యమే మహా భాగ్యం.. కదా. ఇక ఆ ఆరోగ్యమే బాగుంటే తల నెరవటం జరుగదు, జుట్టు ఊడే ప్రసక్తే మీకు రాదు. ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంటే ఆలోచనలు విపరీతమైన వారిలోనే అందోళన కూడా సహజంగానే ఎక్కువ మరి. 
ఫొటో: నెట్

రోజూ ఎగ్ తినడం ఆరోగ్యకరమా? | ప్రపంచ గుడ్డు దినోత్సవం | World Egg Day | అక్టోబర్ రెండో శుక్రవారం | VantintiChitkalu

ఎగ్ ఈజ్ వెరీ 'గుడ్డు'

 ప్రపంచ వ్యాప్తంగా పౌల్ట్రీరంగం మీద అవగాహనను ప్రజలలో పెంపొందించేందుకు ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ ప్రతీ ఏడాదీ అక్టోబర్‌ నెలలో రెండవ శుక్రవారాన్ని ప్రపంచ గుడ్డు దినోత్సవంగా ప్రకటించింది. వయసు తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ నిత్యం కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు ద్వారా లభిస్తాయి. ఎదిగేపిల్లలకు శక్తినిస్తుంది. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ బి–12 శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రయేజనకరం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణానికి, శరీరానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది.


సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం.. | నేడే ప్రపంచ దృష్టి దినోత్సవం | World Sight Day | | VantintiChitkalu

కళ్ళు - ఆరోగ్యం

అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం నాడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ నిర్వహిస్తోంది. కంటి ఆరోగ్యం కోసం విటమిన్ - ఎ, విటమిన్ - సి, విటమిన్ - ఇ ఉన్న ఆహారపదార్థాలను తప్పక తీసుకోవాలి. అంటే పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి, టమాట, క్యారట్, చేపలు.. వీటిల్లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రతిరోజు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే కళ్లు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఎక్కువగా మంచి నీటిని తీసుకోవడం వల్ల కూడా కంటికి మేలు జరుగుతుంది. అలాగే కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి అవసరం. ఇక సంవత్సరంలో ఒక్కసారైనా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవడంలో అశ్రద్ద తగదు.


చేదునిజం: కాకరకాయల్లో ఆకాకరకాయ రుచి వేరయా.. | Small bitter gourd | Kantoli | Kartoli | Teasel Gourd | Sweet Gourd | Forest Bitter Gourd | Kantola | Meetha karela | Cucumis Dipsaceus | Wild Bitter Gourd | బోడ కాకరకాయ | vantintichitkalu

Bitter Gourd : A Wild, Spiny Melon
 
ఆరోగ్య ప్రయోజనాలు:
- ఇట్టే శక్తిని ఇనుమడింపచేస్తుంది.
- చర్మం నిగనిగలాడుతూనూ, దృష్టి లోపం దరిచేరకుండాను ఉంటుంది.
- గాయాలను, వాపును తగ్గిస్తుంది.
- వీటిలో అధిక లైకోపీన్ కంటెంట్ ఉంటుంది.  

   లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడం ద్వారా పలు రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

వరల్డ్ స్మైల్ డే | World Smile Day | Happy Fun Holiday | ప్రపంచ నవ్వుల దినోత్సవం | Vantinti Chitkalu

వ్వండి.. వ్వించండీ..😆
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. ఆరోగ్యానికి నవ్వు ఒక టానిక్‌. నవ్వు వల్ల ఎండోర్ఫిన్‌ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక వత్తిడిని  సైతం తగ్గించడానికి తోడ్పడుతాయి. తద్వారా శరీరంలో రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చు.

నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా ఏపని అయినా చురుగ్గా చేసుకోగలుగుతాం. నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం అని గమనించాలి. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవ్వు వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. మనస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అక్కడ ఆనందం వెల్లివెరిస్తుంది. మనుషుల మధ్య నమ్మకం పెంపొందించబడుతుంది. నవ్వు వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

అందుకే నవ్వు నాలుగు విధాల మేలు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట కూడా. మరి ఏ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయో.. నవ్వులు పువ్వులు పూయిస్తాయో చూస్కోండి మరి.

#SmileDay : First Friday of October

అక్టోబర్ 2: ప్రపంచ జంతువుల దినోత్సవం | అక్టోబర్ 4: ప్రపంచ జంతు సంక్షేమ దినం | World Farm Animals Day | World Animal Day | పెంపుడు జంతువులను ప్రేమించండిలా.. I Pet Animals are Good for Health I Vantinti Chitkalu | వంటింటి చిట్కాలు

ఒంటరితనాన్ని పారదోలి మనకు చేదోడువాదోడుగా ఉండి సంతోషాన్ని, వ్యయామాన్ని తద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించే పెంపుడు జంతువులపై వారాంతాల్లో, సెలవు రోజుల్లో మరింత శ్రద్ధ వహించాలి.
- కాస్త సమయాన్ని వెచ్చించి పెంపుడు జంతువుల నివాసాల్ని, ఉపయోగించే వస్తువులను శుభ్రపరచాలి.  

- పెంపుడు కుక్కని రోజూకంటే కాస్త ఎక్కువ నడకకు తీసుకెళ్లాలి. అదీ కొత్త ప్రాంతం అయితే మరీ మంచిది. 
- కుందేలు, చేపలు, పక్షులు.. ఇలా ఏ పెట్స్ నైనా కాస్త విశాలంగా తిరుగాడే సౌకర్యాన్ని కలిగించాలి.
- వాటిని కొట్టడం, తిట్టడం కాకుండా సరియైన ప్రవర్తన, శిక్షణతో మెలిగేలా చూసుకోవాలి.

అల్లారుముద్దుగా పెంచుకునే జంతువులకు టీకాలు వేయించడం, అనారోగ్యం పాలవుతే వాటిని వెంటనే పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం మరవద్దు.





అక్టోబర్ 2: గాంధీ జయంతి | India pays tribute to 'Father of the Nation'

శుభాకాంక్షలతో..

మహాత్మా గాంధీ ఉదయాన్నే గుజరాత్ వీధుల్లో చీపురుతో మురికి వాడలను శుభ్రపరచేవారు. రాత్రి అయ్యేసరికి ప్రజలు మళ్లీ పాడు చేసేవారు. తిరిగి తెల్లారేసరికి రోడ్లన్ని శుభ్రంగా మారిపోయేవి. ఆయా ప్రాంత వాసులు ఒక పెద్దాయన తెల్లవారు జామునే వీధులను తుడవటం చూసి సిగ్గుపడి రోడ్లను పాడుచెయ్యటం మానుకుని వారూ పరిశుభ్రత పాటించటంలో కృషి చేసారట. ఈ విషయం మనలో ఎవరికి తెలియంది కాదు. పరిసరాల పరిశుభ్రత అంటూ రెండు, మూడు తరగతుల్లోనే చదువుకున్నాం. కానీ ఆచరించడం మర్చిపోయాం. నేటి ప్రధాని గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డపై పుట్టారు కాబట్టి మహాత్ముని స్పూర్తితో స్వచ్చ భారత్ రూపొంచించడం జరిగింది. సరే ఇలాంటి కార్యక్రమాలు మనకు కొత్తేం కాదు. గతంలో క్లీన్ అండ్ గ్రీన్, జన్మ భూమి లాంటి పధకాలు చూశాం.  ఏది సాధించాలన్నా పధకం ప్రకటించినప్పటినుంచి సమర్ధవంతంగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధించేంతవరకు చిత్తశుద్ధి లోపించని ప్రభుత్వాలతో పాటూ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం తప్పనిసరి. 2019లో జరిగే మహాత్మా గాంధీ 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలనాటికి భారత దేశం అన్ని విధాల స్వచ్ఛత సాదించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటూ ప్రతీఒక్కరు సంకల్పించాల్సిన అవసరం ఉంటుంది.