సోంపు నోటిదుర్వాసన తరమడానికి, భుక్తాయసానికి విరుగుడుగానే కాకుండా చాలా సమస్యలకు ఔషధకారిణిగా ఉపయోగపడుతుంది. సోంపు గింజలనే శుభ్రపరచి నేరుగా తీసుకోవచ్చు. కాస్త రుచికి దోరగా వేయించి కూడా వాడుకోవచ్చు. అయితే పిల్లలకు సోంపు పొడిని, సోంపు వాటర్ ని ఇవ్వవచ్చు. సోంపును కాస్త వేయించి పొడి చేసుకోవాలి. ఇక సోంపు వాటర్ విషయానికి వస్తే నీళ్లలో సోంపును వేసి బాగా మరిగించి, చల్లార్చి వడకట్టాలి. లేదంటే అరగంట పాటూ మంచి నీళ్ళలో సోంపును వేసి బాగా నానినతర్వాత వడకట్టి సోంపు నీటిని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సోంపు వంటల్లోనే కాదు. సోంపు టీ కూడా ప్రాచూర్యంలోకి వచ్చింది. - సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్, ఎలాంటి మానసిక ఆందోళనలు దరిచేరవు. - సోంపు తింటే జీర్ణశక్తి మెరుగుపడడమే కాక ఇతర జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా తగ్గిపోతాయి. - ముఖ్యంగా కడుపునొప్పికి, విచేచనం సాఫీగా అవడానికి. నులి పురుగులు పడిపోవడానికి సహకరిస్తుంది. - కఫం తరిమి దగ్గు, ఆయాసం నయం చేస్తుంది. - రక్తహీనత ఉన్నవారు సోంపును తరచూ తీసుకోవడం మంచిది. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. - శరీరంలో వేడిని నియంత్రించడంలో, మూత్ర విసర్జనలో వచ్చే మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. - ఇందులోని ఫైటో ఈస్ట్రోజెన్ మెనోపాజ్ సమస్యల్ని నివారిస్తుంది. ఇందులోని ఫొలేట్ గర్భిణులకి ఎంతో మేలు చేస్తుంది. - సోంపులో అధికంగా ఉండే జింక్, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
తలలో దుమ్ముధూళి చేరకుండా వారానికి మూడు సార్లయినా తక్కువ ఘడత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఇంట్లో దొరికే పదార్థాలను వినియోగించి సహజసిద్ధంగా చుండ్రును తరిమేయవచ్చు. చుండ్రు నివారణలో ముఖ్యంగా నిమ్మకాయ రసం, పెరుగు, మెంతులు, వేపాకు పేస్ట్ వగైరా చెప్పుకోవచ్చు. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారికి వంటింటి చిట్కాలు కొన్ని చూద్దాం.. - జుట్టుకు గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేసి చుండ్రును అరికట్టవచ్చు. నూని పట్టించాక ఒక గంటపాటు టవల్ తలకు బాగా చుట్టేసి తరవాత హెయిర్ బాత్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. - పెరుగులో నిమ్మరసం కానీ, ఉసిరికాయ పొడిని కానీ కల్పిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. - కొన్ని వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. - కలబంద ఆకుల నుంచి జెల్ ను తాజాగా సేకరించి తలకు రాసుకొని పూర్తిగా ఆరాక తలస్నానం చేయాలి. - నువ్వుల నూనెలో కాసిని మందార పువ్వులను చేర్చి బాగా మరగనిచ్చి, చల్లారిన నూనెను జుట్టుకు పట్టించాలి. - గోరువెచ్చని హెయిర్ ఆయిల్ లో కర్పూరం మిళితం చేసి తలకు పట్టించవచ్చు. - మెంతులను నాన పెట్టి పెరుగుతో కలిపి పేస్ట్ చేసుకుని తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
- బల్లలు, కుర్చీలు ఇతర చెక్క ఫర్నీచర్ శుభ్రం చేయడానికి టర్పెంటెయిన్ వాడాలి. - నీలిమందు కలిపిన గోరువెచ్చని నీటితో ఇంట్లో అద్దాలు తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. - వెండి వస్తువులు ఎంత కడిగినా నల్లగా మారితూంటే విభూతి పొడితో తోమితే కాంతివంతంగా వస్తాయి. - కిచెన్ లో వాడే ప్లాస్టిక్ కంటేనర్లు ఇట్టే వాసన వదలడానికి వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో నానబెట్టి కడిగితే సరి. - బంగారు నగలను పంచదార కలిపిన నీటిలో కాసేపు నానపెట్టి ఆ తరువాత సబ్బునీటితో కడిగి బాగా తుడిచేస్తే తళతళలాడుతాయి.
- భోజనానికంటే ముందు ఘరం.. ఘరం.. సూప్స్ తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. - ప్రతి రోజు కనీసం రెండు పూటలా గ్రీన్ టీ తాగండి. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఆరోగ్యంతో పాటు అందం కూడా ఇనుమడింపచేస్తుంది. మనం ఉల్లాసంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది. - బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచి ఫలితంగా కాలుష్య ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. - మెంతులను బాగా నానపెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టించి కాసేపాయ్యాక తలస్నానం చేస్తే చండ్రు సమస్య మటుమాయం అవుతుంది.
నువ్వులు చిన్నవిగా ఉంటాయి, కానీ వీటి వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలే చేకూరుతాయి. ఇవి పూర్తిగా నాణ్యమైన ప్రోటీన్ లతో నిండి ఉంటాయి. నువ్వుల గింజలు మెగ్నీషియం ఇతర పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అందుకని మధుమేహం నివారించడానికి నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అలాగే రక్తపోటు తగ్గించడంలో సహాయకారి అని చెప్పవచ్చు. మనలోని మెగ్నీషియం లోపాన్ని నువ్వులు తరుముతాయి. అయితే ఎంత సేపు తెల్లనువ్వులే వాడకుండా నల్లవి కూడా వాడుకోవాలి. వీటిలో పోషక పదార్థాలు మరిన్ని ఎక్కువే అని చెప్పాలి. ఇందులోని ఫైతోస్తేరాల్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వులు అధికంగా ఫైబర్ కలిగి ఉండడంతో జీర్ణక్రియకు ఎంతో చక్కగా తోడ్పడుతాయి. వీటిలో అన్నీ రకాల గింజల్లో కంటే ఫైటోస్టెరాల్ కంటెంట్ సమృద్ధిగా ఉండడంతో పలురకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. ప్రధానంగా నల్లనువ్వుల్లోని ఇనుము రక్తహీనతను దరిచేరనివ్వదు. అందుకే బలహీనంగా ఉన్నవారు నువ్వుల నూనెతో పాటు, నువ్వులతో తయ్యారయ్యే ఆహారపదార్థాలు తరచూ తీసుకోవడం ఉత్తమం. వీటితో లభించే అధిక రాగి మూలకం వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పైగా ఎముకలు, కీళ్ళు, రక్త నాళాలు బలపడుతాయి.
పాలల్లోకంటే కూడా నువ్వులు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. జింక్ కంటెంట్ కూడా ఎక్కువే. దీని కారణంగా ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతాయి. పిల్లల ఎదుగుదలకు నువ్వుల నూనెతో మర్థనా ఎంతో సహాయపడుతుంది. వారిలో చక్కని నిద్రను అందిస్తాయి. చర్మం పొడిబారకుండా, పలు సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. నువ్వుల్లోని ఒత్తిడి తగ్గించే ఖనిజాలు ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం శారీరకంగా ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా మానసిక ఆందోళనలను దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తాయి. నిద్రలేమిని తరిమికొడతాయి.
సహజ సౌందర్యంలోనూ నువ్వులు, నువ్వుల నూనె ఎంతో ప్రముఖమైనవి. ఆరోగ్యకరమైన స్కిన్ కోసం అధిక జింక్ కంటెంట్ ఉన్న నువ్వులు ఉపయోగపడ్తాయి. నువ్వల నూనెలో ఉన్న విటమిన్ - ఇ, విటమిన్ - బి లు దెబ్బతిన్న శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. చర్మం మెరుపులీనేలా చూస్తుంది. రోజూ నువ్వుల నూనె వాడడం వల్ల చర్మ సంబంధ క్యాన్సర్లను తగ్గిస్తుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను నిరోధించి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం రంగు మారకుండా, ముడుతలు దరిచేరకుండా చేస్తుంది. అలాగే నిగనిగలాడే జుట్టుకోసం కూడా ఎన్నో అవసరమైన పోషకాలతో నిండిన నువ్వుల నూనెను వాడుకోవడం శ్రేష్టం.
వంటింట్లో చిన్న చిన్న చిట్కాలే సమయాన్ని, ఆహార పదార్థాలను వృధాకాకుండా చూస్తాయి. పైగా ఎంతో రుచిని, పోషక పదార్థాలను ఇనుమడింపచేస్తాయి. అలాంటి వంటింటి చిట్కాలు మచ్చుకు కొన్ని చూద్దాం..
నిమ్మ పండుని కోసేముందు బలంగా గట్టుపైన చేతులతో నలపాలి. ఆ తరువాత మధ్యలోకి కోసి పిండితే రసం సులువుగా వస్తుంది.
కరివేపాకుని బాగా కడిగి శుభ్రపరచుకుని, ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి సువాసనలు వెదజల్లుతాయి.
తరిగిన బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే వండేటప్పుడు జిగురు ఉండదు.
అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగ కలిపిన నీటిలో వేయాలి.
వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసిన నీటిలోకి తరుగుకోవాలి.
క్యాబేజీ ఎంత ఉడికించినా వాసన వదలట్లేదా.. చిన్న అల్లం ముక్కను చేర్చి చూడండి.
సాంబార్లో ఉప్పు ఎక్కువైందా.. అందులో ఉడికించిన బంగాళ దుంపలు కలిపితే సరి.
మరెన్నో కిచెన్, హెల్త్, బ్యూటీ, క్లీనింగ్ వగైరా టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం vantintichitkalu యూట్యూబ్ ఛానల్ సబ్స్కైబ్ చేసుకోవాలసిందే..
అల్లం, వెల్లుల్లి.. ఇవి రోజూవారి వంటలో చేరితేనే రుచి. పైగా ఆరోగ్యకరం.
అల్లంతో పైత్యం వదలాల్సిందే
అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, విటమిన్-బికాంప్లెక్స్ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి. ఇవి చాలారోగాలను నయం చేయడంతో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఎన్నో ఆరోగ్యకరమైన పోషక విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజూ వాడగలిగితే మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.
- అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది.
- అల్లం టీ తీసుకోవడంతో జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
- కడుపునొప్పి, శరీరంలో ఇతర నొప్పులు, జలుబు, దగ్గుకు అల్లం చక్కగా పనిచేస్తుంది.
- శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో అల్లం సహాయకారి.
వెల్లుల్లితో గుండె పదిలం
వెల్లుల్లిలో అనేక రకాలైన విటమిన్లు, అయోడిన్, సల్ఫర్, ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని ఆహారంలో ప్రతి రోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చివెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ను కరిగించి ఒబిసిటీ సమస్యను దూరం చేస్తుంది. జలుబు, చెవు నొప్పి, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు తదితర రుగ్మతలు దరిచేరవు. వెల్లుల్లి పేస్టు మొటిమలను నివారిస్తుంది.
కారం చక్కని ఆరోగ్యానికి తప్పనిసరి. మిరప మేటి ఔషధకారిణి. పండు మిరప పచ్చడి, చల్ల మిరపకాయలు ఆధ్రుల అభిమాన ఆహారపదార్థాలు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకృత్తులు, భాస్వరం, ఇనుము, కాల్సియం, మెగ్నీషియం - ఇతర ఖనిజలవణాలు తృణధాన్యాలలో కంటే హెచ్చుగా ఉంటాయి. ఎ, బి, సి, ఇ - విటమిన్లు కూడా మిరపలో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు మిరపలో దాగి ఉన్నాయి. అలవాటుగా రోజూ పచ్చిమిరప, ఎండుమిరప, కారం పొడి, కూరమిరపకాయలను (కాప్సికమ్) వాడటం పరిపాటి. మిరప మన ఆహారంలో కలవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్దిగా లభించడం వల్ల పలు లైంగిక రగ్మతలకు దూరంగా ఉండవచ్చు. చర్మానికి, కంటికి చక్కని ఆరోగ్యం చేకూర్చడానికి విటమిన్-ఎ అవసరం ఉంటుంది. నరాలకు, కండరాలకు, రక్తవృద్ధికి, జుత్తుకు చక్కని పుష్టి కలిగించడంలో విటమిన్-బి పనిచేస్తుంది. విటమిన్-సి పళ్ళ చిగుళ్ళు, దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అలాగే మిరపలో లభించే విటమిన్-ఇ చర్మసంబంధవ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించడంలోను, కొన్ని రకాల హృద్రోగాలను నయంచేయడంలోను సహాయపడుతుంది. మిరపలో లభించే కాల్సియం, భాస్వరం లక్షణాలు ఎముకల నిర్మాణానికి, ఇనుము రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కారణంగా మహిళలకు ఇవి అత్యవసరం అని చెప్పవచ్చు.
మిరపను ఆయుర్వేదంలోనూ, గృహ చికిత్సలలోనూ విరివిగా వాడుతారు. యాన్టీ బ్యాక్టీరియా లా పనిచేస్తూ ఎలాంటి ఇన్ఫెక్షన్ లు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో ఉండే ఎండోఫిన్స్ ఎలాంటి నొప్పులనైనా హరించివేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతాయి. ఇంత మేలు చేసే మిరపను మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది.
చలికాలం కూడా ముఖం పువ్వులాగా వికశించాలంటే చామంతి ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. ఈ కాలంలో ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటిలోనే చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంది. మరి రోజంతా మృదువుగా ఉండాలంటే ఈ చిట్కా పాటించాలి. చామంతి ప్యాక్ ఇప్పటికిప్పుడు ఎలాగబ్బా అనేనా మీ ఆలోచన.. అదేలాగో చూద్దాం.
బాగా శుభ్రపరచి కొన్ని చామంతి పువ్వులను నీళ్లలో ఉడకపెట్టాలి. వడకట్టిన ఈ నీటిలోకి కొన్ని పాలు, కాస్త తేనే చేర్చి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమమే మీ చామంతి ఫేస్ ప్యాక్... శీతాకాలంలో రోజూ ఉదయం దీనితో ముఖంపై బాగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇక రోజంతా ముఖారవిందమే..
చలి - పులి : శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్..
చలికాలం.. అందం, ఆరోగ్యం పై ప్రతీఒక్కరు శ్రద్ద పెట్టాల్సిన సమయం. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దుల ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే టీనేజర్స్ సైతం శీతాకాలంలో తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు, స్నానం, నిద్ర.. ఇలా ప్రతీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. జీర్ణక్రియ మందగించడం, రోగ నిరోధక శక్తి క్షీణించడం మూలంగా పలు రుగ్మతలకు దారి తీయకుండా ఉండాలంటే.. సమయానికి ఆహారం వేడిగా తీసుకోవడం తో పాటు తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పనిసరి. నిత్యం నడక, వ్యాయామం, సరిపడా నిద్ర అవసరం. ఉదయం పూట సూర్యరశ్మి శరీరానకి చాలా అవసరం. అయితే ఎండను ఎదుర్కోవడానికి తగు మెళకువలు తప్పవు. బయటికి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.
మీకు మొబైల్ ఫోన్ కవి కానీ, రచయిత కానీ కావాలని ఉందా..
స్మార్ట్ ఫోన్ అంటే సమయాన్ని వేస్ట్ చేసే గాడ్జెట్ అనుకుంటున్నారా.. అయితే మీ ఆలోచన మార్చుకోండి. స్మార్ట్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనమే కాదు. ప్రపంచమంతా మీ గుప్పిట్లో ఉన్నట్లే. ఇంతేకాదండోయ్.. మీకు రచనాసక్తి ఉంటే బుక్కు, పెన్నుతో పనే లేదు. చక్కగా చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లోనే రాసేస్తూ మీరు కవో రచయితో అయిపోవచ్చు.ఇలా ఈమధ్య ముసో అనే ఓ తెలుగు కవి, రచయిత మొబైల్ ఫోన్ తో వినూత్న ప్రయోగం చేశారు. స్మార్ట్ ఫోన్ తో హైకూలనే మైక్రో పోయెట్రీ రాసేసి ఆ తర్వాత ఓ పుస్తకంగా ప్రింట్ వేయించారు. అదే మై ఫస్ట్ లీఫ్- ఇంగ్లిష్ మోడ్రన్ పోయెట్రీ, నాలో నేను అనే తెలుగు హైకూల కాంబో ఎడిషన్.
మీరు కూడా మొబైల్ ఫోన్ కవో, రచయితో అయిపోచ్చు. అదెలాగంటారా.. బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడో, ఆఫీసులో కాస్త టైమ్ దొరికినప్పుడో, ఇంట్లో బోర్ కొట్టినప్పుడో మొబైల్ చేతబట్టుకుని రాయదలుచుకున్నది రాసేయండి. అలా అలా కొంత మెటీరియల్ పోగయ్యాక ఓ బుక్కులా అచ్చేసుకోవచ్చు. లేదంటే మీకంటూ ఓ ఫేస్ బుక్ పేజో మెయింటెయిన్ చేసేయ్యొచ్చు. ఈ ఐడియా ఇప్పటిది కాదండోయ్. జపాన్ లో ఏకంగా మొబైల్ నవలలే పాపులర్ అయిపోతున్నాయి. 2002 లో ఓ జపనీ కుర్రది మొబైల్ ఫోన్ పట్టుకుని నవలకు శ్రీకారం చుట్టింది. అది అలా అలా సాహిత్య ప్రక్రియలా ప్రాచూర్యంలోకి వచ్చింది. బోలెడు మంది మొబైల్ నావెలిస్టుల్నీ తయారుచేసింది. జపాన్ నుంచి అమెరికా, బ్రిటన్ మీదుగా యూరప్ దేశాలకూ ఈ సరికొత్త సాహిత్య ప్రక్రియ పాకుతూ పోతోంది. ఇంకెందుకాలస్యం.. మీరూ ట్రై చేయండి. ఈలోగా ముందు చెప్పిన హైకూ పుస్తకం విశేషాలేమిటో చూడండి.
My First Leaf - Modern Haiku నాలో నేను - తెలుగు హైకూలు రచయిత - ముసో వెల - రూ. 80 ఆన్ లైన్ స్పెషల్ ఎడిషన్ - రూ. 100 http://vmrgbooks.com/index.php?route=product/product&product_id=296 పబ్లిషర్స్ - Swings Media
పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాలలో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరువేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో - ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. ఆవు పాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృత్తులు 3.4 శాతం, పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 0.7 శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృత్తులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.
అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమపేరుతో మోసపోకుండా స్పృహాలో ఉండడం చాలా అవసరం.
- అందచందాలను వర్ణిస్తుంటే ఏ అమ్మాయైనా ఇట్టే బుట్టలో పడాల్సిందేనని కొందరి నమ్మకమైతే ఇంకాస్త తెలివైనవాళ్లు(దుర్మార్గపు) కళ్లు, ముక్కు, కంఠస్వరం ఇలా అదిరిపోయాయంటూ పొగడ్తలకు దిగుతారు. వాస్తవాలను గ్రహించి అమ్మాయిలే అప్రమత్తంగా ఉండాలి. - అమ్మాయిల హృదయాలను దోచుకోవడానికి చిన్నచిన్న బహుమతులను (తక్కువ ఖర్చులో) ఎరగా వేస్తుంటారు. పాపం డబ్బుతో ఏముందిలే మనసుకదా ప్రధానం అనుకుని ఖరీదైన బహుమతులను అందచేస్తూ బోల్తాపడతారు కొందరు అమ్మాయిలు. - ప్రేమంటూ దరిచేరేవారి ప్రవర్తనపై ఆరాతీయాలి. మీతో వ్యవహరిస్తున్న తీరులో మరియేతరులతోనైనా ఉన్నారేమో గమనించాలి. మిగతా అందరితో సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడా తెలసుకోవాలి. వారి ప్రేమలో నిజాయితీ పాలు ఎంతో లెక్కకట్టిఅడుగేయ్యాలి. - చదువు, చిరునామా, ఉద్యోగం, కుటుంబనేపథ్యం ఇలా పూర్తి వివరాలు రాబట్టగలగాలి. కార్లు, బంగ్లాలు బంధువులు, స్నేహితులవైనా తనవేనని బురిడీకొట్టిచ్చే ప్రమాదముంది. ధనికులమని నమ్మించడానికి వేసే పైపై మెరుగులను గుర్తించాలి. - గర్ల్ ఫ్రెండ్ ఒక సరదాకోసమో, కాలక్షేపానికో అనుకునేవారున్నారు. గర్ల్ ఫ్రెండ్ వేటలో ఇదివరలోనే పెళ్లి అయిన వాళ్లు, పిల్లలున్నకల వాళ్లు కూడా పడ్తారు. వారి ప్రేమలో పడే అమ్మాయిలే జాగ్రత్తపడాలి మరి. - పబ్బులు, పార్టీలు ఇలా వేటికైనా ఒంటరి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఒకే అమ్మాయిని ఆహ్వానించడంలో దుర్బుద్ధిదాగుందని పసిగట్టాలి. ఒంటరి అమ్మాయిని చేసి వారి స్నేహితులంతా కలసి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంది. - కారణమేదైనా బాయ్ ఫ్రెండంటూ ఒకే హొటల్ గదిలో ఉండడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం, రాత్రివేళల్లో కలవడం అన్నీ అత్యంత ప్రమాదకరమే. - డ్రింకులు, ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. మత్తుపనీయాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం. ఇరువురు సేవించినా, బాయ్ ఫ్రెండ్ సేవించినా గ'మ్మత్తు'లో చిత్తయ్యేది అమ్మాయే. - అన్నీ వేళలా వారితో కలిసే ప్రదేశం నలుగురు అందుబాట్లో ఉండేదై ఉండాలి. నిర్జన ప్రదేశం, ఎత్తైన కొండలు, సెలయేరులంటూ ఎకాంతం మంచిదికాదు. - బాయ్ ఫ్రెండ్ వెకిలిచేష్టలను ఎప్పటికప్పుడు నిరోదించగలగాలి. కోరికలు తీర్చుకోవడానికి తహతహలాడే వాడిని మనసు గాయపడకుండా తెలివిగా తిప్పికొట్టాలి. - అవకాశం చిక్కినప్పుడల్లా తనొక్కతే గర్ల్ ఫ్రెండా ఇంకేవరైనా ఉన్నారాని మోబైల్ ఫోను, మేయిల్ బాక్స్ పై కన్నేసి ఉంచాలి. - ఒకరికై ఒకరు వెచ్చిస్తున్న డబ్బు ఎంతో కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా డబ్బు నీకై ఖర్చుచేసానని బాయ్ ఫ్రెండ్ కి సాకు దొరకనీయకూడదు. మీరే ఎక్కువ మొత్తంలో డబ్బు అతని కోసమై ఖర్చుచేస్తూంటే ఆర్ధిక అవసరాలకై మిమ్మల్ని వాడుకుంటున్నాడని అనుమానించాలి.
ఈ విషయాలే కాకుండా యువత భారతదేశంలో పెళ్ళి, కుటుంబ వ్యవస్థలు బలీయమైనవని, ఆదర్శప్రయమైనవని ఎల్లప్పుడూ గుర్తెరగాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందగాడా, ధనవంతుడా అని చూసుకోవడం కంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది. శాశ్వతంకాని అందం, ధనం భ్రమలో పడి గుణం లేనివాడితో ఏడడుగులేస్తే జీవితమంతా చీకటిమయమే.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని ఆరగించాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం..- ధారగా వస్తున్న నీటిలో పండ్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల విషరసాయనాలతో పాటు నిగనిగలాడడానికి పూసిన రంగులు, నూనెలు వగైరా దూరమవుతాయి. - గోరువెచ్చటి నీళ్లలో పూర్తిగా పండ్లు కాసేపు ఉంచి కడగడంతో తొందరగా మళినాలు వదిలే అవకాశముంది. - కాస్త ఉప్ఫు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. - ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచి నీళ్లలో మునిగేలా ఉంచి చక్కగా రుద్ది కడిగి పొడిగా తుడిచాకే పండ్లని తినాలి. - పండ్లు పగుళ్లున్నా, దెబ్బతగిలినా తినకూడదు. పగుళ్లతో పండ్ల లోపలికి వెళ్లిన రసాయనాలు మన ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు తెస్తాయి. - కుళ్లిపోయిన పండ్లు, రసాయనాలు పొడిరూపంలో పైన కనిపించిన పండ్ల జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. - గది ఉష్ణోగ్రతలకు మించి లేదా రిఫ్రిజిరేటర్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లు విషతుల్యమే. - అరటి, కమలా, బత్తాయి వంటి తొక్క ఉన్న పండ్ల విషయంలో కూడా జాగ్రత్తలవసరం.
మన నిద్రకు అవరోధం, తోటివారికి అసౌకర్యం కలిగించేది గురక.
నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికితోడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం కూడా గురకకు కారణాలు కావచ్చు. ఈ వంటింటి చిట్కాలతో గురక సమస్యని శాశ్వతంగా తరమండి.
- తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనెతో కొన్నిరోజులపాటు మూడు పూటలా తీసుకోవాలి. - రాత్రి పడుకునే ముందు యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో ఆవిరి పట్టాలి. - పిప్పర్‌మెంట్ ఆయిల్ కలిపిన గ్లాస్ నీటితో రోజూ రాత్రి బాగా పుక్కిలించాలి. - ఆలివ్ ఆయిల్, తేనెల ఒక స్పూన్ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు తీపుకోవాలి. - గోరువెచ్చటి నీటిలో కాస్త స్పూన్ ఇలాయిచీ పొడి చేర్చి తాగి పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. - శొంఠి, పిప్పళ్లు, మిరియాలు.. వీటి పొడిని తేనెతో కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
చలికాలంలో పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కాలి మడమలపై పగుళ్ల సమస్య తలెత్తుతుంది. డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్యని అశ్రద్ద చేస్తే మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.
ప్రతిరోజూ పాదాలను గోరువెచ్చటి నీటితోనే కడగాలి. పాదాలను, కాళ్ళ వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. పగుళ్ళు ఇతర సమస్యలు బాధిస్తుంటే గోరువెచ్చని నీటిలో కాసేపు పాదాలను ఉంచి బ్రష్ తో శుభ్రపరచాలి. ఈ నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ లేదా లావెండర్ ఆయిల్ ని కూడా వాడుకోవచ్చు. ఇవి మృతకణాలను తొలగించడం, చమట దుర్వాసనలను తరమడంతో పాటు యాంటి ఫంగల్‌గా పనిచేస్తాయి. మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేస్తుండాలి. ఫూట్ క్రీమ్ ను క్రమం తప్పకుండా రాస్తుండాలి.
అందం, ఆరోగ్యం, అలంకరణ, టైం సేవింగ్.. దేనికైనా గృహచిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. పైగా పెద్ద సమస్యలకు సైతం ఉచితంగా, సునాయసంగా చిటికెలో సమాదానం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మీ కోసం www.vantintichitkalu.com అందిస్తున్న ఎఫెక్టివ్ హోం రెమెడీస్.. వంటింటిచిట్కాలు యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి..
ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శరీరానికి కావల్సిన అనేక ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. తోటకూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలి, మునగ, అవిశె.. వగైరా ఆకుకూరలతో అత్యధిక కేలరీల శక్తి ఇట్టే లభిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకు వగైరా వంటలకు ఘుమఘుమలు అందించడంతో పాటు రక్తవృద్ధిని, జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. పలు రోగాలు నయం చేయడంలోనూ, అవి దరిచేరకుండానూ ఇవి కాపాడుతాయి. అందుకే మన రోజూ ఆహారంలో పచ్చని ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇవి శుభ్రపరచుకోవడం, వలుచుకోవడం, తరగడం కష్టమని వీటికి దూరం కావద్దు. అలాగే వాటి నిల్వలో, వంటలో పోషకాలు నశించకుండా మరెన్నో జాగ్రత్తలు అవసరం. - వండటానికి ముందు శుభ్రంగా రన్నింగ్ వాటర్ లో కడగాలి. వీలైతే కాసేపు కాస్త ఉప్పు చేర్చిన నీటిలో నాననివ్వాలి. - తాజా ఆకుకూరలు వాడుకోవడమే ఉత్తమం. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకూడదు. - ఆకుకూరలపై సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. లేదంటే వాటిల్లోని కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి. - ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి లేదా అసలు తరగకుండా వండుకోవడం చాలా మంచిది. - ఆకుకూరలు వండేటప్పులు వంట పాత్రలపై మూతలు పెట్టుకోవాలి. వీటిని వేయించడం తగదు.
గంజి నీళ్ళు.. మన ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. ఇది శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్యం ఈ గంజితో సాధ్యమవుతుంది. బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా బియ్యం ఉడుకుతున్నప్పుడే నీటిని వేరు చేయాలి. లేదా అన్నం ఉడకగానే మిగిలిన నీటిని పాత్రలోకి వార్చాలి. ఈ గంజిని వేడిగానైనా, చల్లారకనైనా తీసుకోవచ్చు. రుచికి ఉప్పు, పిప్పర్ పౌడర్ జోడించవచ్చు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణం శక్తిని చేకూరుస్తాయి. మనసు ప్రశాంతంగా మారి, ఏకాగ్రతను పెంచేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.
సౌందర్య పోషణలో.. - రైస్‌వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల, క్లెన్సింగ్ ఎఫెక్ట్ పొందవచ్చు. జిడ్డు, మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖ వర్చస్సు ఇనుమడింప చేస్తుంది. - బియ్యం కడిగిన నీటిని జుట్టుకి బాగా పట్టించి కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే కురులు పట్టుకుచ్చులా మారతాయి. - స్నానం చేసే నీటిలో బియ్యం కడిగిన నీటిని చేర్చడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి.