కాస్త చేదైనా కమ్మని రుచులను అందించేది కాకరకాయ. ఇది అనేక రకాల వంటలతో పాటు సౌందర్యపోషణలోనూ ఉపయోగపడుతుంది. ఆయుర్వేద తదితర సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లో వివిధ వ్యాధులను నయం చేయడం కోసం కాకరను వినియోగిస్తారు. కాకరకాయలతో రకరకాల కూరలు, పులుసులు, సూప్స్, సలాడ్స్, వడియాలు, పచ్చళ్ళు వగైరా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎ, బి1, బి2, సి, ఇ, కె ఇలా పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
కాకరలోని హైపోగ్లెసీమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి, డైయాబెటీస్ ను అదుపు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లను ఎదుర్కొవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది. అనవసర బరువు తగ్గి అందమైన శరీరాకృతి కోరుకునే వారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి. కాకరకాయ జ్యూస్లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే ఎలాంటి అనారోగ్యం దరిచేరదనేది తీపికబురు.

1 comment:
Would appreciate to write in English too.
Post a Comment