మేడే అంటే ప్రపంచ శ్రామికులకు, కార్మికులకు స్పూర్తిదినం. విశ్వవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో జాతీయ శలవుదినంగా, అనధికారికంగా చాలా దేశాల్లోనూ కార్మికులకు పండగరోజుగా మే ఒకటి ప్రసిద్ధి. చరిత్రలోకి వెళితే 1886వ సంవత్సరం అమేరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమదోపిడికి గురైన కార్మికులు 'ఎనిమిది గంటల పనిదినం' కోసం శాంతీయుతంగా చేపట్టిన ఉద్యమం కాస్తా గుర్తు తెలియని వ్యక్తి పోలీసులపై డైనమేట్ బాంబు విసరడం, తదుపరి పరిణామాల పర్యవసానంగా అనేకమంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నవారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. నాటినుండి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాల కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఎర్రజెండా నీడలో అనేక ఉద్యమాలు సాగిస్తునే ఉన్నారు. కార్మికుల శ్రమకు, శక్తికి, చమటకు, రక్తానికి ఎంతో విలువుందని ప్రపంచానికి చాటిచెప్పారు.
వాస్తవానికి అంతకంటే చాలాకాలం ముందే యూరపు ఖండంలో పని గంటల కోసం, భద్రత కోసం, వేతనాల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1848లో కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళికే కార్మికవర్గానికి కరదీపికైంది. అయితే చికాగోలో జరిగిన కార్మికోద్యమం ప్రపంచదృష్టిని ఆకర్షించి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. ఆ ఒరవడి కొనసాగుతూ రష్యాలో 1917 మొదటి సోషలిస్టు దేశం ఏర్పాటుకు దారి తీసింది. ఇదే తొలి శ్రమజీవుల రాజ్యం. కష్టానికి తగ్గ ఫలితం. పూర్తి భద్రత, పాలనలో కార్మిక భాగస్వామ్యం, గృహవసతి, ధరల స్థిరీకరణ, సంక్షేమపథకాలు తొలి సారి అందించింది సోషలిస్టు దేశాల్లోనే. దీంతో ప్రపంచ కార్మికవర్గమంతా సోషలిజం వైపు ప్రభావిత మవడం ఆరంభమైంది. దీన్ని ఎదుర్కోవడానికి పెట్టు బడిదారీ దేశాలూ సంక్షేమపథకాలు ప్రవేశపెట్టాయి. మన దేశంలో మొదటగా 1862 సంవత్సరం హౌరాలో రైల్వే కార్మికులు సమ్మె చేయగా మద్రాసులో 1923వ సంవత్సరం మే 1వ తేదిన కార్మికులు మే డే ఉత్సవాలను నిర్వహించారు. కార్మిక సంఘటిత ఉద్యమ ఫలితంగానే శ్రామికుల గృహ, విద్య, వైద్య అవసరాలు, ప్రమాద రక్షణ అవసరాలు దృష్టిలో పెట్టుకొని వేతన చట్టాలను, భద్రతాచట్టాలను, సంక్షేమ చట్టాలను ప్రభుత్వం రూపొందించి అమలుపరుస్తోంది.
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఘంటాపథంగా ప్రకటించిన అభ్యుదయవాది, మహాకవి శ్రీశ్రీ... సహస్రవృత్తులు, సమస్త చిహ్నాలు కవిత్వానికి ప్రాణమని దండోరా వేశాడు. కార్మిక లోకపు కల్యాణానికి... శ్రామిక లోకపు సౌభాగ్యానికి... సమర్పణంగా, సమర్చనంగా శ్రీశ్రీ రాసిన కవితలు వేల మంది యువకవులకు స్పూర్తినిచ్చాయి. వేనవేల ప్రజాగాయకులకు స్పృహనందించాయి. సామ్రాజ్యవాద దురాక్రమణ పంథాను ప్రతిఘటించిన కలం వీరులు ఎన్నో ఎర్ర సిరా చుక్కలు ధారపోసి కవిత్వాలకు అక్షరాలు పేర్చారు. కార్మిక, శ్రామిక వర్గ పోరాటాలకు సంఘీభావం చాటుతూ ఎందరో విప్లవ గళాలు సవరించుకుని జనగీతాలకు పల్లవులై నిలిచారు. మేడే అంటే అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, దురంతాలను ధిక్కరించిన రోజు. కవులు, కళాకారులు ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు.
కార్మికుడు, కర్షకుడు చేతులు జోడించే స్థాయి నుంచి పిడికిళ్లు బిగించేలా పోరాట మార్గాన్ని చూపించింది మేడే. ప్రపంచ కార్మికులారా... ఏకం కండి! అన్న పిలుపుతో శ్రమజీవులందరూ ఒక్కతాటి మీద నడిచారు. పోరాటమనే ఆయుధాన్ని అందుకున్నారు. బానిస సంకెళ్లను తెంచుకునే సాహసాన్ని, శక్తిని సమకూర్చుకున్నారు. ఒకే పర్వదినం ప్రపంచం నలుమూలలా ఒకే రోజు జరుపుకుంటారంటే అది కచ్చితంగా 'కార్మికుల దినోత్సవం' అవుతుంది.