ఇళ్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్ తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి అస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచమే కాక ఎప్పుడూ అంతా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదులకు సరియైన వెంటిలేషన్ ఉండాలి. తలుపులు కాసేపైనా తెరిచి తాజా గాలి వీచేలా చూసుకోవాలి. మిగతా గదుల్లో కిటికీలు తెరిచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహించేలా చూసుకోవాలి. నివాస పరిసరాల్లో చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి రావడం, తద్వారా గాలిలో తేమశాతం తగ్గడం జరుగుతుందని గమనించాలి. అలాగే ఫ్లోర్ తో పాటు ఇళ్లంతా నెలకోసరి అయినా దుమ్ము, ధూళి దులిపి వస్తువులను సర్దుకోవాలి. దీంతో డస్డ్ అలర్జీలు, సీజనల్ అలర్జీల నుండి దూరంగా ఉండచ్చు. ఇక ఆస్తమా, ఇతర అలర్జీతో బాధపడేవాళ్లు పెంపుడు జంతువులకి దూరంగా ఉండడమే ఉత్తమం. క్రిమికీటకాల వల్ల కూడా అలర్జీలు, చర్మవ్యాధులు వస్తుంటాయి. ఇంట్లో తేమ, చల్లదనం కారణంగా చీమలు, దోమలు, ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు.. ఇవేవి దరిచేరకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరి.
No comments:
Post a Comment