ఫాదర్స్ డే!.. ప్రతీయేటా జూన్ మూడో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం అనేది కుటుంబ సభ్యుల్లో తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పటానికి ఉద్దేశించబడినది. దీని పుట్టుపూర్వోత్తరాలలోకి వెళ్తే మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపిందని తెలుస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తన బాధ్యతతో పాటు ఆరుగురు తోబుట్టువుల అలనాపాలనా అన్నీ తానై తండ్రి చూసుకున్నాడు. అందుకు కృతఙతగా తండ్రి పుట్టిన రోజును ఫాదర్స్ డే గా జరిపింది. దానికి కాలక్రమంలో 1966వ సంవత్సరం నుండి అధికారికంగా గుర్తింపు వచ్చింది.
- పితృదేవో భవ.. ప్రతీ తండ్రికి తన పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న తపన ఉంటుంది.
- అతి సర్వత్ర వర్జయేత్.. అన్నట్టుగా పిల్లలపై తండ్రికి కఠినత్వం, గారాభం మితిమీరి ఉండకూడదు. తిట్టడం, కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదని గమనించాలి.
- సత్యమే వజయతే.. పిల్లలకు అబద్దాలు చెప్పడం అలవడకుండా చూసుకోవాలి. వారి ముందు తల్లితండ్రులు సత్ప్రవర్తనతో మెలగాలి.
- స్నేహమేరా జీవితం.. చిన్న వయసులో వారితో తండ్రిలా.. టీనేజిలో స్నేహితుడిలా వ్యవహరించాలి. రోజులో వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపడమే కాకుండా ఏది మంచి, ఏది చెడు అన్నవిచక్షణను కలిగించాలి.
- ప్రేరణతోనే విజయం సాధ్యం.. ఇంట్లో పిల్లలను ఒకరిని ఎక్కువ మరొకరికి తక్కువ చేసి చూడకూడదు. అలాగే ఇతరులతో పోల్చి తమ పిల్లలను తక్కువ చేసి మాట్లాడరాదు. ఆత్మన్యూనతకు లోనవకుండా పిల్లలకు తరచూ సానుకూల మాటల్ని చెబుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.

No comments:
Post a Comment