- రోజంతా ఫ్రెష్ గా ఉండి, రాత్రి కమ్మని నిద్ర పట్టాలంటే రెండు పూటలా గోరువెచ్చని స్నానం ఆచరించడం మంచిదని వైద్యనిపుణులు చెప్తున్నారు. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రమవడమే కాక ఇతర లాభాలు ఉన్నాయి. శరీర నొప్పులను తగ్గించగలిగే శక్తి వేడినీటికి ఉంది. అంతేకాకుండా గోరువెచ్చటి నీటి స్నానం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అంటే మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఫలితంగా మంచినిద్రకు దారితీస్తుంది. మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ప్రస్తుతకాలంలో టీవి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకం విపరీతమయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అయితే నిపుణుల సలహాలను తప్పక పాటించాల్సి ఉంది. లేదంటే కంటి సమస్యలు, మానసిక ఆంధోళన.. ఇతర అనారోగ్యసమస్యలు తప్పవు. సహజంగానే సూర్యకిరణాలలోని అతినీలలోహిత కిరణాలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కంటి కింద నల్లనిచారలు, చుట్టూ చర్మంపై ముడతలు చిన్న వయసులోనే వచ్చేలా చేస్తాయి. కాబట్టి కంటిని కాపాడుకునేందుకు చక్కని పెద్ద గాగుల్స్ ధరించంచాలి.
- లిఫ్ట్‌లు, ఎలివేటర్లు.. వచ్చాక మెట్లు ఎక్కే శ్రమ తప్పింది. అయితే మెట్లు వాడడం అనేది చక్కని వ్యాయామం అని గుర్తించాలి. మెట్లు వేగంగా ఎక్కడం వల్ల కండరాలకు చక్కని రూపం వస్తుంది. శరీరంలోని అదనపు కేలరీలను బరువును సులభంగా కరిగించుకోవచ్చు. సో.. అన్ని సందర్భాల్లో కాకున్నా వీలైనంతవరకు స్టెయిర్ కేస్ వినియోగిస్తారు కదూ!.
- ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా స్టైల్, ఫ్యాషన్ ముసుగులో నప్పని వస్త్రాల జోలికి వెళ్లద్దు. ఒంటికి అతుక్కుపోయినట్లుండే జీన్స్ వేసుకోవడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ బిగుతుగా ఉండే జీన్స్ శరీర కండరాల కదలికలను అడ్డుకోవడమేకాక వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
- మహిళలు హ్యాండ్ బ్యాగ్, ఎత్తు మడమల చెప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బరువైన ఆభరణాలను ధరించడంవల్ల కూడా మెడ కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది.

No comments:
Post a Comment