కాస్మటిక్స్‌కు దూరంగా ఉంటూ మీ చర్మం సహజ సౌందర్యంతో తొణకిసలాడాలనుకుంటున్నారా? దానికి పోషకవిలువలున్న ఆహారం తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.. మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ముఖ్యంగా రోజూ మీ ఆహారంలో ఏమి ఉండాలంటే..
- పాలకూరలో బి, సి, ఇ - విటమిన్ లు ఉండటంతో పాటు విటమిన్ - ఎ, బెటాకెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా చర్మాన్నికాంతి వంతంగా ఉంచుతాయి.
- క్యారెట్స్ లో కూడా విటమిన్ - ఎ, బీటాకెరోటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటితో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతాయి.
- నిమ్మలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ గుణాలను తగ్గించి, పీహెచ్ లెవల్‌ను పెంచుతుంది.
- చర్మ సంరక్షణకు సబ్జా గింజలు, ఫ్లాక్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్.. ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి.
- టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ నిగారింపును ఇనుమడింపచేస్తుంది. అంతే కాక కాలుష్యం, హానికారక సూర్య కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది.
- చర్మ సౌందర్యానికి ఎంతగానో అవసరమయ్యే విటమిన్ - ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పప్పుల్లో పుష్కలంగా ఉంటాయి.
- పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను దరిచేరకుండా చూస్తాయి.
- ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా అవకాడోస్ పనిచేయడమే కాక ఇందులోని విటమిన్ - ఇ చర్మానికి ఒక చక్కని టానిక్ అని చెప్పవచ్చు.
- చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ - బి బీట్రూట్ తో లభిస్తుంది. ఇది గోళ్లు, కేశాల ఆరోగ్యానికి సహకరిస్తుంది. పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది.

No comments:
Post a Comment