వరల్డ్ మ్యూజిక్ డే.. మొదటగా ఫ్రాన్స్ లో 1982 వ సంవత్సరం జూన్ 21న ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రపంచ దేశాల్లో సంగీత ప్రియులు ఇలా 'మ్యూజిక్ డే'ని జరుపుకుంటున్నారు. సంగీతానికి అనంతమైన శక్తి ఉంది. మనిషిని కదిలించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం.. ఆవేశం.. వినోదం.. విషాదం.. ఇలా ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. సువిశాల సంగీత ప్రపంచంలో ఎన్నో సంగీతాలు. శాస్త్రీయ సంగీతం, జానపదం, పాప్ మ్యూజిక్.. ఇలా ఎన్నో. ముఖ్యంగా భారతీయ సంగీతాన్ని ప్రధానంగా శాస్త్రీయ సంగీతం, జానపదం, ఆధునిక సంగీతం.. ఇలా మూడు విభాగాలుగా చెప్తారు. మనకు శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ ఎక్కువ. అలాగే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్ వగైరాలను కూడా నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. హ్యప్పీ వరల్డ్ మ్యూజిక్ డే..!
No comments:
Post a Comment