అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్..
పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్నాయ్.. ఇక అల్లరికి ఇంత సమయం చిక్కకపోవచ్చు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదని గుర్తించాలి. సభ్యత, సంస్కారం అలవడేలా చూడాలి. క్రమశిక్షణతో పిల్లలను పెంచడం ఒక కళ అంటారు. సహజంగా కూతురు తండ్రిని, కొడుకు తల్లిని అనుకరిస్తారని సైకాలజీ నిపుణులు చెప్తారు. అందుకని తగు జాగ్రత్తలతో నడుచుకోవడం అవసరం.
- పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. అలా జరగకుండా దృష్టి మళ్ళించడమే కాకుండా వాటి వల్ల అనర్థాలను తెలియచెప్పాలి.
- ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పే పద్ధతిని పెద్దలను చూసి పిల్లలు అలవర్చుకుంటారు.
- 'ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు..' అని విసుక్కునేకన్నా చక్కగా వస్తువులను సర్దుకోవడంలో ఉన్న ప్రయోజనాలను తెలియచేయాలి.
- వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహణ కలిగించాలి.
- చాక్‌లెట్ రేపర్స్.. ఇతర చెత్తను ఎప్పటికప్పుడు చెత్తబుట్టలో వేయడం లాంటివి పిల్లలకు నేర్పాలి.
- మంచినీళ్ళు, పాలు తాగిన గ్లాసులు పిల్లలు ఎక్కడివి అక్కడే పడేయకుండా సింక్ లో వేయడం, డైనింగ్ టేబుల్ మ్యానర్స్ నేర్చుకునేలా చూడాలి.
- విడిచిన బట్టలను ఎక్కడ వెయ్యాలో, ఏవి హ్యాంగర్‌కి తగిలించాలో.. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకునే అవకాశముంది.
- స్కూళ్ బ్యాగ్, ఇతర సామాగ్రి సమయానికి చిక్కేలా చూసుకోవాలి.
- నేటి రోజుల్లో పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని గమనించండి.
- పిల్లల ఐక్యూ పెంచేలా మంచి పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచండి. మంచి విషయాలు చెప్పండి. చెస్, పజిల్స్, రిడిల్స్.. పిల్లల మెదడుకి పదునుపెడ్తాయి.
- పెయింటింగ్, మొక్కలు పెంచడం, బుక్ రీడింగ్.. లాంటి మంచి అలవాట్లు వారి సృజనాత్మకతను తట్టి లేపుతాయి.
- తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా వారితో రోజూ కొంత సమయం గడపడం అవసరం.
- గ్రాండ్ పేరెంట్స్ అతి గారాబం పనికిరాదు. అది మీకు సంతృప్తినివ్వొచ్చేనేమో కానీ వారి ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడదు.
- పిల్లలతో వారించకుండా మీ పిల్లల మాటలు కూడా వినండి.
- వారి పనులను వారు చేసుకునేలా ప్రోత్సహించడం మరవద్దు.

https://www.youtube.com/c/vantintichitkalu
pc:internet