బయటికి వెళ్తే చాలు వాహనకాలుష్యం, దుమ్ము, ధూళీ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం అంతా నల్లపడడం, జిడ్డుగా మారడం జరుగుతోంది. అలాంటప్పుడు కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే క్షణంలో మళ్ళీ ఫ్రెష్ నెస్ తోపాటు ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దామా..
- కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద రుద్దడం ద్వారా చర్మం శుభ్రపడటమే కాకుండా స్వేద గ్రంథులు తెరచుకుంటాయి. ఇట్టే చర్మం తాజాగా మారిపోతుంది.
- ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ చుక్కలను కలిపిన పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. గ్లోయింగ్ స్కిన్
మీ సొంతమవుతుంది.
- నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి జాగ్రత్త పెట్టుకోవాలి. సరిపడా పొడి తీసుకుని కొన్ని చుక్కల రోజ్ వాటర్ చేర్చి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
- బాదాం లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల కాంతులీనే చర్మం మీ సొంతం అవుతుంది.
- కలబంద గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే చర్మం కోమలత్వాన్ని సంతరించుకుంటుంది.
- పర్‌ఫ్యూమ్ వాడేముందు చర్మానికి పెట్రోలియం జెల్లీ రాసుకుంటే ఆ పరిమళం చాలాసేపటి వరకు అలాగే ఉంటుంది.
- యాపిల్ సీడర్ వెనిగర్‌ని హెయిర్ కండీషనర్‌లా వాడడం వల్ల దుమ్ముధూళీ సులభంగా వదలడమే కాక జుట్టు మృదువుగా అవుతుంది.
- ఎక్కువ నల్లగా తయారయ్యే మోకాళ్ళు, మోచేతులు, మెడ భాగంలో నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆ చెక్కలతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేసిన తర్వాత పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలా రోజుకోసారి చొప్పున వారంలో మూడు సార్లైనా చేస్తూంటే మంచి ఫలితం కనబడుతుంది.

No comments:
Post a Comment