ఒకప్పుడు మన దగ్గర కేశ సౌందర్యానికి మాత్రమే కొబ్బరినూనె వాడేవారు. రానురాను అందులోని కాస్మోటిక్స్, మెడిసినల్ బెనిఫిట్స్ కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి కొబ్బరినూనె అవసరం అయింది. న్యూట్రీషియన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్న కారణంగా కొబ్బరినూనెను సౌందర్యపోషణలోనే కాక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహారపదార్థంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురియైనప్పుడు నేచురల్ ఆయిల్ తగ్గిపోతుంది. దీన్ని భర్తి చేస్తూ చర్మం మళ్ళీ మృదుత్వం సంతరించేకోవాలంటే కొబ్బరి నూనెను వినియోగించాలి. ఏ కాలంలోనైనా చర్మం పొడిబారితే చక్కని మాయిశ్చరైజర్‌గా కొబ్బరినూనెను వాడుకోవచ్చు. అలాగే పెదవులు పొడిబారి పగిలి ఇబ్బందికలిగిస్తూంటే రాత్రి పెదవులకు కొబ్బరినూనెతో మృదువుగా మర్దన చేస్తే సరిపోతుంది. గోళ్లు పెళుసుబారి నిర్జీవంగా మారితే కొంత కాలం పాటు కొద్దిగా కొబ్బరినూనెను రాసి చూడండి. పాదాల పగుళ్ల నివారణకు కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా అప్లై చేస్తూంటే కొద్ది రోజుల్లోనే సమస్య మాయమవుతుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడినప్పుడు కొబ్బరి నూనెను అప్లై చేసి సున్నితంగా రబ్ చేయాలి. ఒంటిమీద గాయాలకు ఇన్ ఫెక్షన్ సోకకుండానేకాక శరీరంపై దురద, దద్దుర్లు తగ్గించడంలో కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు దరిచేరవు.
No comments:
Post a Comment