శారీరకంగా లేదా మానసికంగా ఎక్కువ శ్రమకులోనవడం వల్ల అలసట కలుగుతుంది. మరి ఆధునిక కాలంలో అలసట తప్పదా.. అంటే కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు..
అలాగే చిన్నచిన్న బ్యూటీ టిప్స్ తో ముఖంలోని అలసటను ఇట్టే తరిమేయవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు.. అవేంటో చూద్దాం..
- నిస్సత్తువ ఆవరించటానికి ఒంట్లో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ కి లోనవడం ఒక కారణం. ఫలితంగా శరీరంలో అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరగక మెదడు పనితనం నెమ్మదించడం, పని చేసే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. అందుకని దాహం వేసేవరకు వేచి చూడకుండా మంచినీటిని తరచూ తాగుతూనే ఉండాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
- బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అలసట తప్పదు. కారణం క్రితం రోజు రాత్రి నుంచి మధ్యాహ్నభోజనం వరకు శక్తి అందకపోతే శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లను తీసుకోవాలి. మధ్యాహ్నం పూట కార్బొహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లతో కూడిన ఆహారం విధిగా తీసుకోవాలి. అప్పుడే శారీరక శక్తి మరియు మానసిక శక్తి సొంతమవుతాయి.
ఎంత అలసిపోయినా ఫ్రెష్ లుక్ తో కనపడాలంటే..
- ఓట్ మీల్ మంచి నేచురల్ స్క్రబ్బర్. దీంతో ముఖంపై రుద్దుకుని చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
- కొన్ని ఐస్ క్యూబ్ లను పల్చటి క్లాత్ లోకి తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దినా, గంధాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచినా ముఖంలో ఉండే అలసట మటు మాయమవుతుంది.
- అలసట కళ్లపై కనిపించకుండా కొద్దిసేపు ఐస్ బ్యాగ్స్, కీరాదోసకాయ ముక్కలు, టీ బ్యాగ్స్ వగైరా వాడుకోవచ్చు.
No comments:
Post a Comment