వర్షం అనగానే తల తడవకుండా జాగ్రత్త పడతాం. కారణం జలుబు, జ్వరం.. ఇట్టే వచ్చేస్తాయని. అంతేకాకుండా కురులు వర్షం నీటిలో తడిస్తే నిర్జీవం అయిపోతాయి. అందుకే జుట్టు తడవనివ్వకుండా కాపాడుకుంటాం. తడిస్తే మాత్రం వీలైనంత త్వరగా జుట్టు ఆరబెట్టుకోవాలి. తలస్నానం చేసే ముందురోజు రాత్రి జుట్టుకు కొబ్బరి నూనె మర్థనా చేసుకుంటే మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చస్తే సరిపోతుంది. వానాకాలంలో వాతావరణం చల్లచల్లగా ఉందని స్నానానికి వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీటిని వాడుకోవాలి. తరవాత సున్నితమైన టవల్ తో తుడుచుకుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. ఈ కాలంలో పాదాలు ఎక్కువగా తడవడంతో ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ సమస్య ఎదురవుతుంది. అందుకని వర్షపు నీటిలో పాదాలు తడిచిన వెంటనే శుభ్రమైన నీటితో కాళ్ళను కడుక్కోవాలి. తడి లేకుండా పూర్తిగా తుడిచి, ఆరనిచ్చి పాదాలకు కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్‌ను అప్లై చేయాలి. కళ్లకు మేకప్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఈ సీజన్‌లో పొల్యూషన్ ఎక్కవ కారణంగా కంటిని కాపాడుకోవడంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. అలసిపోయినట్టయితే కళ్ల మీద కొద్దిసేపు ఐస్ క్యూబ్స్ పెట్టుకుని ఉపశమనం పొందాలి. దురదలుగా ఉన్నప్పుడు కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని పది నిమిషాలు ఉంటే సరిపోతుంది.
No comments:
Post a Comment