విద్యా, వృత్తి వ్యాపకాల్లో పడి ఆహారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం తప్పదని తెలుసుకున్న నేటి తరం హెల్త్ కాన్సియస్ నెస్ గా ఉండడం నేర్చుకుంటోంది. ఆరోగ్యం విషయంలో ఎంతటి ఖర్చుకు వెనకాడడం లేదు. పౌష్టికాహారం, శుభ్రమైన మంచి నీటిపై ఎక్కువ దృష్టిపెట్టడమేకాక పరిసరాల పరిశుభ్రత, వ్యాయామం పై కూడా మక్కువ చూపిస్తున్నారు. ఏ వ్యాధికైనా చికిత్స కంటే నివారణే ముఖ్యం అని గమనించి మెసులుకుంటున్నారు. నడక, జాగింగ్‌తో పాటు ఇతర వ్యాయామాలే కాక యోగా, ధ్యానం పట్ల కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. సీజనల్ ఫుడ్ ఇష్టమున్నా లేక పోయినా సమతుల్య ఆహారం కోసం తీసుకోవడమే కాక మితాహారం నియమం కూడా పాటిస్తున్నారనే చెప్పాలి.
- రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తగినన్ని మంచి నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పెద్ద ప్రేగు శుభ్రం అయి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
- ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగడం ద్వారా అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. అవసరమైతే తేనె కలుపుకోవచ్చు.
- పలు రకాల ఎలర్జీలను పారద్రోలడానికి ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగాలి. కొన్ని అల్లం ముక్కలకు, తేనే చేర్చికూడా సేవించవచ్చు.
- అల్పాహారంలో విధిగా తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహారం తీసుకోవాలి. అంటే ఇడ్లీ, వడ, స్ప్రౌట్స్ , ఓట్స్ వంటివి తీసుకోవటం మంచిది.
- నిద్రలేవగానే ఖాళీ కడుపుతో వ్యాయామం, యోగా వంటివి చేయకూడదు. కాలకృత్యాలు తీర్చుకుని కనీసం ఒక గ్లాసు మంచినీళ్లైనా తాగడం మంచిది.
- సరియైన విశ్రాంతి, నిద్ర తప్పనిసరి. నైట్ షిఫ్ట్ ఉద్యోగస్తులకైనా ఇవి వర్తిస్తాయి.

No comments:
Post a Comment