కడుపులో గ్యాస్ సమస్య కేవలం తీసుకున్న ఆహారం అరగకపోవడం వల్లే కాదు.. అసలు ఏం తీసుకోకపోయినా తలెత్తుతుంది. ఇది అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకని సమయానికి భోజనం, మంచి నీరు ఎక్కువ గా తాగడం, సరియైన విశ్రాంతి, వ్యాయామం పట్ల దృష్టి సారించాలి.
- ఆహారాన్ని గబగబా తినటం, మాట్లాడుతూ తినటం.. సరికాదు. దీంతో జీర్ణాశయంలోకి గాలి ఎక్కువగా చేరి త్రేన్పులకు దారితీస్తుంది.
- ఎక్కువ మసాల లేదా కొవ్వు పదార్థాలు తినటం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది.
- మానసిక ఒత్తిడి, ఆందోళన, కూల్ డ్రింక్, పొగ తాగటం.. వగైరా కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి.
- కాఫీ, టీ, ఎనర్జీడ్రింకులు వంటివన్నీ పేగుల్ని డీహైడ్రేషన్‌కు గురిస్తాయి.
- పాల పదార్థాలు, పిండి పదార్థాలు.. కడుపులో గ్యాస్ నిండేలా చేస్తాయి.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
- మంచినీళ్లు మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. మూత్రపిండాలు, పెద్ద పేగులలో మలినాలు శుభ్రం అవడానికి ఉపకరిస్తాయి.
- ఒక గ్లాసు మంచినీళ్లలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుని తాగితే కడుపు ఉబ్బరం నయం అవుతుంది.
- తరచూ ఉడికించిన ఆపిల్‌ను తీసుకోవడం వల్ల ఉదరంలోని ఇన్‌ఫెక్షన్లు మాయమవుతాయి.
- పీచు పదార్థాలతో పాటు అరటిపండు, పాలకూర, కీరదోసకాయ, క్యారెట్, టొమోటో, అల్లం, చిరు ధాన్యాలు తీసుకోవడంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
- అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే కొబ్బరి బోండాం తాగితే సరిపోతుంది.
- దానిమ్మగింజల రసం తీసుకుంటే మలబద్ధకం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
- జీర్ణప్రక్రియ చురుగ్గా జరగడానికి మజ్జిగ, పుదీన, నిమ్మకాయ, అల్లం, ధనియాలు, పసుపు వంటివి సహకరిస్తాయి.
- ఒక స్పూన్ తేనె తాగితే వెంటనే అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
- యాలకులను (ఇలాచీలు) పొడిచేసి కాసిని నీళ్లలో మరిగించి, చల్లార్చిన మిశ్రమం తీసుకుంటే గ్యాస్ సమస్యలు ఇట్టే తొలిగిపోతాయి.
No comments:
Post a Comment