ఆషాడమాసం ఈ విళంబి నామ సంవత్సరంలో జులై 14న మొదలై 11వ తేది ఆగస్టు 2018 వరకు ఉంటుంది. ఆషాడంలో అతివలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకోవడంలో అరోగ్య రహాస్యం ఇమిడిఉంది. కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్ డైగా, గోరింటాకు పొడిని హెన్నాగా విరివిగా ఉపయోగిస్తున్నాం. గోరింటాకులో ఉండే ఔషధగుణాలు మన శరీరాన్ని రక్షించి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి వరమైన గోరింట సూక్ష్మక్రిములను నశింపచేయడంతో పాటు పలు ఇన్ఫెక్షన్ లను దరిచేరకుండా చూస్తుంది. అయితే నాసిరకం మెహందీల వల్ల దుష్ప్రభావాలు అనేకం అని గుర్తించాలి.
- గోరింటాకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది.
- పైత్యం, గొంతు ఇన్‌ఫెక్షన్, చర్మ వ్యాధులకు గోరింటాకు చెక్ పెట్టడమే కాక నయం చేస్తుంది.
- దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గోర్లను, పాదాలను, చేతులను రక్షిస్తుంది.
- గోరింటాకు కషాయం గాయాలకు, నొప్పులకు మంచి ఔషధం అని చెప్పవచ్చు.
మీ అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండడానికి www.vantintichitkalu.com అందిస్తున్న చిట్కాలు..
- ముందు రోజు రాత్రి ఆకు శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవడం ఉత్తమం.
- కల్తీ పౌడర్, కోన్ లతో అనేక అనార్ధాలు తప్పవు కనుక ఆకును ఆరపెట్టి పొడిచేసి వాడుకోవచ్చు.
- మెహందీ పెట్టుకునే ముందు సబ్బుతో శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.
- పెట్టుకున్న డిజైన్ పూర్తిగా వెంటనే ఆరిపోకుండా ఆరార నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమం కాటన్ బాల్ తో అద్దుతుండాలి.

No comments:
Post a Comment