వర్షాకాలం అన్నీ వయసుల వారికి ఆనందకరమైనది. అందులో సందేహం లేదు కాని అదే సమయంలో ఏమాత్రం దుస్తుల శుభ్రత విషయంలో అజాగ్రత్తగా ఉన్నా ముతక వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతాయి. సరియైన సూర్యరశ్మి పడకపోవడంతో ఉతికిన గుడ్డలు సరిగా ఆరవు. ఈ తేమతో కూడిన బట్టలు అలాగే భద్రపరిచినా, వేసుకున్నా ముతక కంపు కొడుతాయి. అయితే దుస్తుల ఎంపిక, శుభ్రపరచడంలో మెళకువగా ఉంటే ఈ వర్షాకాలం ఎంతో ఎంజాయ్ చేసేయొచ్చు.
వర్షాకాలంలో దుస్తుల ఎంపిక అనేది చాలా ముఖ్యం. దళసరి గుడ్డలైతే వర్షంలో తడిసినా ఆరడం కష్టం, పైగా ఉతికి ఆరేసినా ఓపట్టానా పూర్తిగా ఆరవు. దీంతో ఇబ్బందికరమైన దుర్వాసనలు తప్పవు. అలాగే ఈ కాలంలో మరకలు ఎక్కువగా చేరే ప్రమాదమున్నందున లేత రంగు వస్త్రాలను ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. వాతావరణం ఎలాగూ డల్‌గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ ట్రై చేయడానికి ఇదే మంచి సమయం అని గుర్తించాలి. పొడవుగా కాళ్ల చివర్ల వరకూ ఉండే దుస్తులను ఈ కాలంలో వేసుకోకపోవడం మంచిది.
ఇక దుస్తుల నిర్వహణ విషయానికి వస్తే విప్పిన దుస్తులను వాషింగ్ మిషన్ లో వేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. వీటికి విడిగా ఒక బాస్కెట్ ని వాడుకోవాలి. వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్ తో పాటుగా కొంచం బేకింగ్ సోడా లేదా వెనిగర్ ని వాడితే బట్టలకు ఎటువంటి చెడు వాసనలు పట్టకుండా సువాసనలు వెదజల్లుతాయి. వాషింగ్ మిషన్ లో నుంచి దుస్తులను వెంటనే తీసి ఎండలో లేదా గాలి ప్రసరించే ప్రదేశంలో ఆరవేయాలి. దుస్తులు ముడతలు పడకుండా దులపడం, తిరిగేసి ఆరవేయడం మరవద్దు. అలాగే విడివిడిగా ఆరవేయడంతో బట్టలు పూర్తిగా తేమ లేకుండా పొడిగా ఆరుతాయి. వీటిని వార్డ్ రోబ్ లో అలాగే కుక్కేయకుండా ఐరన్ చేసుకుని సర్దుకోవాలి.
లేదంటే తేమ చేరి మన దుస్తుల ముతక వాసనతో ఇతరులు ఇబ్బందిపడక తప్పదు. పైగా ఈ అపరిశుభ్రమైన వస్త్రాలతో అనేక ఎలర్జీలకు గురికావాల్సివస్తుంది.

No comments:
Post a Comment