పూలమొక్కలు, కూరగాయల మొక్కలు, అలంకరణ మొక్కలు.. ఏవైనా సరే నాటుకోవడానికి ఇది అనువైన కాలం. అందుకని చాలామంది గార్డెనింగ్ పై ఆసక్తి చూపిస్తారు. అయితే వర్షాకాలంలో మొక్కలను చీడ పీడలు ఎక్కువగా ఆశించే ప్రమాదముంది. మరి వాటిని హానికర రసాయణాలు ఉపయోగించకుండా ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే నివారించడమెలానో చూద్దాం..
- సేంద్రియ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యదాయకమైన పెరటితోటలు సొంతమవుతాయి.
- మొక్కలపై దుమ్ముధూళీ చేరకుండా చూసుకోవడం, సరియైన గాలి, సూర్యరశ్మి పడేలా జాగ్రత్తవహించడం అవసరం.
- మడి, కుండీల్లో మట్టిని సజీవంగా ఉంచడం ద్వారా పోషకాల సమతుల్యత దోహదపడుతుంది. దీనికి సహజ సిద్ధమైన కంపోస్టు ఎరువులను తరచూ వాడుతూ మొక్కలను కాపాడుకోవాలి. మట్టిలోని సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందకపోతే మొక్కలు బలహీనపడడమే కాక పురుగులు, తెగుళ్లు చేరుతాయి.
- ఎలాంటి దుష్ప్రభావాలు లేని వేపనూనె, కానుగునూనె, బంతికాడల కషాయం, కొయ్య బూడిద మొదలైన వాటితో స్ప్రే ద్రావకాలు తయారచేసి వాడుకోవాలి.
- లీటర్ నీటిలో ఒక చెంచా కారం పొడి బాగా కలియపెట్టి మొక్కల మీద చల్లడం ద్వారా కీటకాలను నివారించవచ్చు. ఈ మిశ్రమంలో కాస్త లిక్విడ్ సోప్ లేదా కుంకుడుకాయ రసం చేర్చితే మరీ మంచిది.
- ఒక్కో చెంచా వంటసోడా, సోయాబీన్ నూనెను తీసుకుని నాలుగు లీటర్ల నీళ్లలో కలిపి తరచూ స్ప్రే చేస్తూంటే క్రిమికీటకాలతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లకు తావుండదు.
- పుల్ల మజ్జిగ మొక్కలపై కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను సైతం నశింపచేస్తుంది. అందుకని నాలుగైదు రోజులు మజ్జిగను బాగా పులియపెట్టి దాన్ని కావలసినంత నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
- లీటరు నీటిలో గుప్పెడు దవనం ఆకులను వేసి బాగా మరిగించాలి. చల్లారక దీనికి రెండింతలు మంచి నీటిని చేర్చి మొక్కలపై పిచికారీ చేయాలి.
- కిరోసిన్ ని మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితం లభిస్తుంది.

No comments:
Post a Comment