రోజూ కిచెన్, లివింగ్, బెడ్ రూంలను శుభ్రపరిచినట్లే బాత్ రూం క్లీనింగ్ పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే అనారోగ్యం లేదా ప్రమాదాలు తప్పవు. అన్నీ గదుల్లో లాగానే చక్కని గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి. ఏదో డిమ్ లైట్ లకు పరిమితం కాకుండా ఎక్కువ వెలుతురు ఉండే ఎలక్ట్రికల్ బల్బ్ లనే వాడుకోవాలి. బాత్ రూమ్ లో ఎక్సాస్ట్ ఫ్యాన్ అమర్చుకోవడం వల్ల వాసనలు సులభంగా తొలగించబడతాయి. స్నానాలగదిని రెండు లేదా మూడు రోజులకొకసారియైన ఫినాయిల్‌తో శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అవసరమున్నా లేకపోయినా బాత్ రూం లో అన్ని వస్తులను చేర్చి స్టోర్ రూం లా చేయకూడదు. సబ్బు, షాంపూ, హ్యాండ్ వాష్.. వగైరా నిత్యవసరమైనవి మాత్రమే అందుబాటులో ఉండాలి. వాడేసిన, ఎక్స్పైరీ అయిన టాయిలెట్ సామాగ్రీని వెంటనే తొలగించాలి. ఎల్లవేళలా బాత్ రూం తడి, తేమ లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే తడితో ప్రమాదాలు, తేమతో క్రిమికీటకాల అడ్డాగా మారే ప్రమాదముంది. టూత్‌పేస్ట్, బ్రష్ వగైరా అక్కడే ఉంచకూడదు. బాత్రూంలో వాటిపై ఇట్టే సూక్ష్మక్రిముల చేరుతాయి. స్నానం చేసేటప్పుడు గోడల మీద నీళ్ళు ఎక్ఉవగా చిందకుండా చూసుకోవాలి. అతి వేడి నీళ్లు బాత్రూంలో వాడడం వల్ల టైల్స్ అందవిహీనంగా మారతాయి. పైగా తేమ కూడా ఎక్కువ చేరుతుందని గమనించాలి. బాత్రూం లో ట్యాప్ ల లీకేజితో ఒక్కబొట్టు నీళ్లు కూడా కారకుండా ఉండాలి. బాత్‌రూమ్ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళే మార్గాలు సక్రమంగా ఉండాలి. టాయ్ లెట్ తో పాటు బాత్‌రూమ్‌లో కింద శుభ్రంగా ఉన్నట్టే చుట్టూ వున్న గోడలు కూడా క్లీన్ గా ఉండాలంటే నెలకోసారియైన ఫినాయిల్ నీళ్ళతో కడగాలి. విడిచిన బట్టలు అక్కడే గంటలతరబడి వదిలేయడంతో దోమలు, చీమలు, బొద్దింకలు.. చేరే అవకాశం ఉంది. పైగా బాత్రూంలో వాసన ఇబ్బంది పెడుతుంది. కాళ్లతో మురికి బాత్రూంలోకి చేరకుండా, తడికాళ్లతో బయటికి రాకుండా నిరోధించడానికి అనువైన డోర్ మ్యాట్ ని విధిగా వాడాలి. న్యూస్ పేపర్, మొబైల్ ఫోన్ వగైరా బాత్రూంలో వినియోగించకపోవడమే మంచిది. స్మోకింగ్ కూడా బాత్రూంలో పనికిరాదు. దీంతో బాత్రూం పొగచూరడం, వ్యర్థాలకు కారణం అవుతుంది. బాత్రూంలో క్లీనింగ్ ఏజెంట్ గా ఘాటైన కెమికల్స్, యాసిడ్స్ వాడకూడదు. అలాగే ఎయిర్ ఫ్రెష్ నర్.. ఎట్టిపరిస్థితుల్లో ముక్కుపుటాలు అదిరేలా ఉండేవి ఉపయోగించకూడదు. బాత్రూంలో అద్దం వాడుతున్నట్టైతే ఎప్పుడూ పొడిగా తుడవాలి.
No comments:
Post a Comment