సీజనల్ ఫ్రూట్స్ తో ఆయా కాలాల్లో ఏర్పడే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో దొరికే ఫలాల రారాజు మామిడి ఈ సారి చాలా ప్రియం అయింది. సరియైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మామిడి సీజన్ గతంతో పోలిస్తే నెలా పదిహేను రోజులు ఆలస్యం కావడం, దిగుబడి తగ్గడం.. వెరసి మామిడి పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా మార్కెట్లలో కార్బైడ్ రసాయణాలతో కాయలను పక్వానికి తేవడం వల్ల కూడా సామాన్యుడికి మామిడి పండు మజా దూరం అయింది. రానురాను మామిడి పండ్లలో మాధుర్యం తగ్గడమే కాక వ్యాపారుల లాభాపేక్షతో అనేక మంది రోగాలభారిన పడే పరిస్థితిలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు దాదాపు మామిడి పండ్ల సీజన్ చివరికి వచ్చిందనే చెప్పాలి.
సహజసిద్ధంగా పండిన పళ్లను తింటే ఆరోగ్యం కానీ కృత్రిమంగా పండిన పండ్లను తింటే కచ్చితంగా అనారోగ్యమేనని వైద్యులు చెప్తున్నారు. మామిడి పండ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి డీహైడ్రేషన్ కి లోనవకుండా కాపాడడంతో పాటు శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తాయి. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవడంతో క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్-సి, పెక్టిన్, పీచు, సీరం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్న కారణంగా మామిడి పండు తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు జీర్ణక్రియ బాగా జరగడానికి, సుఖవిరేచనం అవడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పీచు అదనపు కేలరీలను దహించడం ఫలితంగా బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. మామిడిలోని తక్కువ గ్లెసిమిక్ ఇండెక్స్ వల్ల శరీరంలో షుగర్‌స్థాయి పెరగదు. విటమిన్-సి, విటమిన్-ఎ, పలు రకాల కెరటోనాయిడ్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో అధికంగా ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి దీనివల్ల సహజంగా ఐరన్ సమకూరుతుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయి మెరుగుపడుతుంది.

No comments:
Post a Comment