ఎస్. ఎస్. రాజమౌళి ఈగ చిత్రం గుర్తుండే ఉంటుందికదా. అవును ఆ సినిమా కథలో లాగే తెలుగు రాష్ట్రాల్లో ఈగలు పగపట్టడం కొన్ని సందర్భాల్లో విందులు బహిష్కరిస్తే ఏకంగా గ్రామాలనే వదిలి వెళ్ళాల్సిన పరిస్థితులు చూసాం..
ఈగలు ఆషాడ మాసంలో విజృంభిస్తాయి. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు నివారించాలంటే ఏకైక మార్గం వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అని అందరూ గుర్తించాలి.
ప్రధానంగా అనారోగ్యానికి కారణమయ్యే ఈగలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తడి లేదా తేమ పరిసరాల వల్ల ఈగలు తొందరగా వృద్ధి చెందుతాయి. చెత్తాచెదారం మీద వాలిన ఈగలు మనం తినే ఆహార పదార్థాలపై వాలుతుంటాయి. ఫలితంగా ఆహారం కలుషితమై అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందకని ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. మంచినీరు, ఆహారపదార్థాల పాత్రలపై విధిగా మూతలు ఉండాలి. నిల్వ ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలాగే వాటిని ఎప్పటికప్పుడు చెత్తకుండీల్లో పడేసి, పాత్రలను శుభ్రం చేయాలి. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాస్త పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు చేరకుండా ఉంటాయి. వేడి నీళ్లలో లావెండర్ నూనెను కలిపి ఇంట్లో నాలుగు మూలలా చల్లాలి. వేపాకు పొగ పెట్టడం వల్ల కూడా ఈగలను ఇట్టే తరిమేయవచ్చు. పుదీనా, బంతి మొదలైన మొక్కలు పెంచడం వల్ల ఈగలు పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.

No comments:
Post a Comment