ప్లాస్టిక్ వినియోగం వల్ల అనారోగ్యం, ప్రాణాపాయం అని తెలిసినా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ మయమయిపోయింది. ఇందులోంచి ముందుగా పిల్లలను రక్షించే మార్గాలనైనా యుద్ధప్రాతిపదికన వెతుకుదాం..
- మనం నిత్యం వినియోగించే ప్లాస్టిక్ కవర్ల తయారీలో వాడే ముడిసరుకు, రంగులలో కొన్ని రకాల క్యాన్సర్ కారకాలున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ముప్పు తేవడమేకాక వీటిల్లో ఆహారపదార్థాలను ఉంచినప్పుడు అవి కచ్చితంగా కలుషితమవుతాయి. కవర్లలో ఉంచి ఫ్రిజ్ లో నిల్వచేసిన పండ్లు, కూరగాయలు మంచినీళ్లతో కడిగినా ప్లాస్టిక్ కాలుష్యం వీడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- నాణ్యమైన ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే వేడి నీళ్లలో కడిగిన తర్వాత వాడుకుంటే ప్రమాదం ఉండదు. కానీ అన్నివేళలా ప్లాస్టిక్ నాణ్యతను గుర్తించడం కష్టమవుతుంది. అందుకని గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్.. వంటి వాటిల్లో ఆమ్ల లేదా క్షార తత్వం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి చెడు జరగదు.
- పిల్లలకు పాలు పట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ తో కూడా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున స్టీల్ సీసాలు వాడుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఇది స్టెర్లైజ్ చేయడం కూడా సునాయసం అని గమనించాలి.
- పిల్లల స్నానం కోసం వినియోగించే వస్తువులు సబ్బుపెట్టి, బల్ల, బకెట్, మగ్.. ఇవన్నీ ప్లాస్టిక్ తో తయారయినవే అయితే అనర్థాలు తప్పవు. వీలైనంతవరకు స్టీల్, ఇత్తడి లేదా రాగి వస్తువులను వినియోగించడం ఆరోగ్యకరం.
- ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే పిల్లలలో నాడీ వ్యవస్థ, మానసిక ఎదుగుదలల్లో లోపాలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కనుక పిల్లలను విధిగా మట్టిబొమ్మలు, చెక్క బొమ్మలతోనే ఆడించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- కారుచౌకగా లభిస్తున్న ప్లాస్టిక్ లంచ్ బాక్స్, వాటర్ బాటిళ్లతో అనేక అనర్థాలు ఎదురవుతాయి. వీటిలోని ఆహారం విషతుల్యమై పిల్లలను అనారోగ్యం పాలు చేస్తాయి.
ఎంత జాగ్రత్తపడి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినా పిల్లల ఔషధాలు సింహభాగం ఇంకా నిషేధిత ప్లాస్టిక్ పెట్ బాటిల్లలో అమ్మడం గమనార్హం. వీటి వాడకంతో అసలు రోగాలు నయం అవటం అటుంచి ఇతరేతర జబ్బులు తప్పవు.